-సేవలు & కొత్త పౌర సేవా పోర్టల్"పై డివిజనల్ స్థాయిలో తొలి విడత శిక్షణకొవ్వూరు (ప్రజా అమరావతి);


న్యూ సిటిజన్ సర్వీస్ పోర్టల్ నిర్వహణ పై క్షేత్రస్థాయిలో సిబ్బంది పూర్తిగా అవగాహన కలిగి సమర్ధవంతంగా పౌర సేవలు అందించాల్సి ఉందని డివిజనల్ అభివృద్ధి అధికారి పి. జగదాంబ తెలిపారు. 


బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో 26.01.2022న ప్రారంభించనున్న ఈ-సేవలు & కొత్త పౌర సేవా పోర్టల్"పై డివిజనల్ స్థాయిలో తొలి విడత శిక్షణ


కార్యక్రమం నిర్వహించారు. 


ఈ సందర్భంగా జగదాంబ మాట్లాడుతూ, 

 ఈరోజు తణుకు-అర్బన్ మండలాల్లోని డిజిటల్ అసిస్టెంట్ లు, VROలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, అర్బన్ ఏరియా - డిజిటల్ అసిస్టెంట్‌లందరికీ  శిక్షణ అందిస్తున్న ట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరింత మెరుగ్గా పౌర సేవాలను అందించేందుకు 130 పైగా  రెవెన్యూ, మునిసిపల్, మెడికల్, పౌర సరఫరాలకు చెందిన పౌర సేవలను  "26.01.2022న ప్రజలకు అందుబాటులో కి తీసుకుని వొస్తున్నట్లు తెలిపారు. ఈ-సేవలు & కొత్త పౌర సేవా పోర్టల్"  సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా మెరుగ్గా నిర్వహించేందుకు ఈ శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


ఈ డివిజనల్ స్థాయి శిక్షణ కార్యక్రమంలో గోపాలపురం, అత్తిలి, పెరవలి, చాగల్లు, దేవరపల్లి, ఉండ్రాజవరం, తాళ్లపూడి మండలలు, తణుకు మునిసిపాలిటీ కి చెందిన 300 మంది సచివాలయ సిబ్బంది,  తదితరులు  పాల్గొన్నారు.  అదనపు జిల్లా కో-ఆర్డినేటర్, J.బాలకృష్ణ, మాస్టర్ ఆఫ్ ట్రైనర్  ఎండి.అలీ, PS Gr-VIడిజిటల్ అసిస్టెంట్ ఎస్ ఆర్ వి ఎం ప్రభాకర్, వార్డ్ ఎడ్యు.& డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ  SBCC జిల్లా కో-ఆర్డినేటర్ ఎం.రాజేశ్వరరావు పాల్గొన్నారు.