అంగన్వాడీ ఆయాల పోస్టుల భర్తీ ని అత్యంత పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని ఆర్డీవో ఎస్. మల్లుబాబు, ఐసీడీఎస్ పీడీ కె. విజయ కుమారి తెలిపారు.




కొవ్వూరు (ప్రజా అమరావతి);


అంగన్వాడీ ఆయాల పోస్టుల భర్తీ ని అత్యంత పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని ఆర్డీవో ఎస్. మల్లుబాబు, ఐసీడీఎస్ పీడీ కె. విజయ కుమారి తెలిపారు.



స్థానిక ఆర్డీవో కార్యాలయంలో గురువారం కొవ్వూరు డివిజన్ పరిధిలోని పెరవలి, పెనుమంట్ర, సమిశ్రీగూడెం ప్రాజెక్ట్ లకు చెందిన అంగన్వాడీ కేంద్రాల అంగన్వాడీ కార్యకర్త లు,   ఆయా (సహాయకులు) పోస్టు లకు, అంగన్వాడీ టీచర్ పోస్టు పదోన్నతులకి  ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఈ రోజు ఐసీడీఎస్ మూడు ప్రాజెక్ట్ లకు చెందిన తొమ్మిది మండలాల్లో అంగన్వాడీ కేంద్రాలలో సిబ్బంది కొరత లేకుండా పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకం కోసం ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఈపోస్ట్ ల కోసం  దరఖాస్తు చేసుకున్న వారిలో 110 మంది మహిళలు ఇంటర్వ్యూకి హాజరయ్యారని తెలిపారు.  ఈ అంగన్వాడీ కేంద్రాలలో పనిచేసే సిబ్బందికి అంకితభావం, సేవ గుణం కలిగి ఉండడం ముఖ్య మన్నారు. పిల్లలకు ప్రభుత్వ పరంగా అందచేసే టీకాలు,  వ్యాక్సినేషన్, పౌష్టికాహారం , పిల్లల సంరక్షణ , ఇంగ్లీషు లో కనీస పరిజ్ఞానం అంశాలపై ఇంటర్వ్యూ నిర్వహించామన్నారు. సంబంధించిన పోస్టు ల కోసం నిర్దేశించిన మార్గదర్శకాల పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒక తల్లిలా పిల్లల సంరక్షణ, బాగోగులు చూడడంతో పాటు ఎప్పటికప్పుడు పిల్లల వివరాలు యాప్ లో అప్ లోడ్ చెయ్యడం ముఖ్య మన్నారు. సిబ్బంది పిల్లల తల్లితండ్రులకు  శిక్షణా కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పించాలన్నారు. 



 ఐసీడీఎస్‌ పీడీ కె.విజయకుమారి వివరాలు తెలుపుతూ,     కొవ్వూరు డివిజన్ పరిధిలోని మూడు ప్రాజెక్ట్ లకు చెందిన 9 మండలాలు చాగల్లు, నిడదవోలు, ఉండ్రాజవరం, తణుకు, పెరవలి, పెనుమంట్ర, పెనుగొండ, ఇరగవరం , అత్తిలి లలో ఖాళీగా ఉన్న 5 అంగన్వాడీ కార్యకర్తలు,  30 సహాయకులు పోస్టులకు ఇంటర్వ్యూలు ఆరు టీచర్ పోస్టు లకు పదోన్నతులకు నిర్వహించామన్నారు.  అర్హత ఉన్నఆయా అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే  సహాయకులు తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతులు కల్పించడం కోసం కూడా ఇంటర్వ్యూలను చేపట్టినట్లు తెలిపారు.  


ఈ ఇంటర్వ్యూలను ఎన్ జి ఓ డాక్టర్ కె. సత్యవతి, తో పాటు సంబంధించిన మండల సీడీపీఓ లు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.


Comments