మైలవరం (ప్రజా అమరావతి) ప్రజా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదిలా పనిచేసి
ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చోరవ చూపాలని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు విజ్ణప్తి చేశారు.
మైలవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం సాయంత్రం యంపిపి ఇస్లావత్ ప్రసన్న రాణి గారి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో మఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారిని ప్రజాప్రతినిధులు సత్కరించగా యంపిటీసి సభ్యులు సర్పంచ్ లు అధికారులకు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు ఆభినందనలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ...
ప్రజాప్రతినిధులు ప్రజలకు అవసరమైన విషయాలను సమావేశాల్లో అధికారులతో చర్చించి ప్రజా సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపాలని కోరారు.అనంతరం సమావేశంలో శాఖల వారిగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశం లో జడ్పీటీసీ స్వర్ణాల తిరుపతిరావు గారు, వైస్ యంపీపి షేక్ రహీమ్ గారు, యంపిడిఓ అనురాధ యంపీటిసి లు, సర్పంచ్ లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment