తణుకు (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రైతుల, మహిళల, పేద, నిరుపేద ప్రజల పక్షాన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, చెరుకువాడ శ్రీరం గనాధరాజు
మంత్రి తెలిపారు.
సంక్షేమం కోసం ప్రతీ గ్రామం లో రైతు భరోసా కేం ద్రాలు, రైతు సలహా మండళ్ళు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక భరోసా ను కల్పించడం జరు గుతోందన్నారు.
శనివా రం తణుకు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల లో రూ.14,88,000 ల వ్యయం విలువ చేసే 8 పవర్ టిలర్స్ రైతులకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ రంగనాధ్ రాజు మాట్లాడుతూ , రైతు భరోసా కేంద్రా ల ద్వారా అధికారులతో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చి రైతులు ఆర్థికముగా నీలాదొక్కుకునే విధంగా ప్రభు త్వం చర్యలు తీసుకుంటోందన్నారు
. రైతు సంతోషంగా, ఆర్ధికంగా నిల్పడితేనె రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని నమ్మే వ్యక్తి మన సీఎం అన్నారు. యూనిట్ ఖరీదు రూ.1,86,000 లులో రైతు వాటా గా 10 శాతం రూ.18,600 లు, ప్రభుత్వ సబ్సిడీగా రూ.74.400 లు, బ్యాంకు ఋణం 50 శాతం రూ.93,000 అందించామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంఎస్ ఎమ్ఈ చైర్మన్ వంక రవీంద్ర నాధ్, ఆర్డీఓ ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment