ఒ మైక్రాన్ వేరియంట్ ను అరికట్టేందుకు జాగ్రత్త చర్యలు చేపట్టాలి

 ఒ మైక్రాన్  వేరియంట్ ను అరికట్టేందుకు జాగ్రత్త చర్యలు చేపట్టాలి*


*: విదేశాల నుంచి జిల్లాకు వచ్చేవారిపై దృష్టి పెట్టాలి*


*ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు సిద్ధంగా ఉండాలి*


*: రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు శంకర నారాయణ*


అనంతపురం, డిసెంబర్ 07 (ప్రజా అమరావతి) :


కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్  ను అరికట్టేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు శంకర నారాయణ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కరోనా కొత్త వేరియంట్ మైక్రాన్ పై జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తో కలిసి మంత్రి శంకర నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్, ఏఎస్పి ఓఎస్డి రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ కరోనా ఒ  మైక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, కేసుల పెరగకుండా ఆదిలోనే అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం అధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. కర్ణాటక సరిహద్దు మన జిల్లాలో ఎక్కువగా ఉండడంతో కర్ణాటక నుంచి కేసులు, వారితోపాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లు వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసులు తగ్గిపోవడంతో టెస్టింగ్ ల సంఖ్య తగ్గిందని, కొత్త వేరియంట్ రావడంతో కోవిడ్ లక్షణాలు ఉన్న చోట టెస్టింగ్ సంఖ్యను మరింత పెంచాలన్నారు. వైరల్ ఫీవర్ లు వ్యాపించకుండా ఫీవర్ సర్వే చేపట్టాలని, క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, వాలంటీర్ లను ఉపయోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, శానిటేషన్ పై ఎలాంటి అజాగ్రత్త ఉండరాదని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. విదేశాల నుంచి బెంగళూరు వచ్చి అక్కడ నుంచి జిల్లాకు వచ్చేవారి వివరాల ట్రేసింగ్ అనేది చాలా ముఖ్యం అని, వారిపై ప్రత్యేక దృష్టి సారించి పాజిటివ్ వస్తే ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లు కూడా ట్రేసింగ్ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్ లు, పైప్ లైన్ లలో ఏవైనా లోటుపాట్లు ఉంటే పరిశీలించాలన్నారు. ఆక్సిజన్ ట్యాంకుల శుద్దీకరణ చేపట్టేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. ప్రజల ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యం అని, ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలన్నారు. కరోనా కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా  ఉండాలని, వైద్యపరంగా కావలసిన మందులన్నీ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అనేది ప్రజలకు తెలియజేయాలని, గతంలో కరోనాను ఎదుర్కొవడంలో నోడల్ అధికారులు సమర్థవంతంగా పని చేశారని, అదే స్ఫూర్తితో కొత్త వేరియంట్ ను ఆదిలోనే అరికట్టేందుకు నోడల్ అధికారులు అంతా ఒక జట్టుగా పనిచేయాలని, కరోనాను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు పై దృష్టి పెట్టాలన్నారు. ఈ నేపధ్యంలో వ్యాక్సినేషన్ కూడా పూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ కరోనా కొత్త వేరియంట్ ఒ  మైక్రాన్  ను అరికట్టేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని, ఇందుకోసం కోవిడ్ యాక్టివిటీ లను చేపట్టాలన్నారు. కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ను ప్రతి ఒక్కరూ పాటించేలా చూడాలని, మాస్కులు వేసుకోవడం, సామాజిక దూరం పాటించడం తదితర కోవిడ్ ఐఈసి యాక్టివిటీ లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మాస్కు వేసుకోకపోతే అలాంటివారికి పెనాల్టీలు వేయాలన్నారు. విదేశాల నుంచి జిల్లాకు వస్తున్న వారిని నిత్యం ట్రాక్ చేయాలని, వారి నుంచి శాంపిల్స్ సేకరిస్తూ టెస్టింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లకు సూచించారు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే వారి నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను ట్రేసింగ్ చేయాలన్నారు. కరోనా కొత్త వేరియంట్ నేపథ్యంలో ఫీవర్ సర్వే ను కొనసాగించాలన్నారు. ఇప్పటికే మూడవ దశ కరోనా వస్తుందని జూలై నుంచి అన్ని విధాలా సిద్ధంగా ఉండగా, ఇప్పటి నుంచి కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కరోనా మరో దశ రాకుండా ఆదిలోనే అరికట్టవచ్చన్నారు. మొదటి, రెండవ దశలో పండుగల సీజన్ వచ్చినప్పుడు కేసులు పెరిగాయని, ఇప్పుడు కేసులు తక్కువగా ఉన్నాయని నిర్లక్ష్యం వహించరాదని, ఐఈసి యాక్టివిటీ లు, మాస్క్ ప్రోటోకాల్ పాటించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పెండింగ్ ఉన్న వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తిచేయాలని, ప్రతి రోజు 5 వేలు టెస్టింగ్ చేసేలా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ సరఫరా పై వచ్చిన సమస్యలను ముందే గుర్తించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చూడాలన్నారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్లను ఇప్పటికే ఏర్పాటు చేసి ఆయా సెంటర్లకు టీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కోవిడ్ కేర్ సెంటర్లలో నీటి సరఫరా, లైట్లు, ఫ్యాన్లు పనిచేస్తున్నాయా లేదా, బెడ్ లు ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. మండల స్థాయిలో 104 కాల్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, కాల్ సెంటర్లు పనిచేస్తున్నాయా లేదా అనేది పరిశీలించాలని, కాల్ సెంటర్లలో నియమించిన సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. ఐఈసి యాక్టివిటీ లలో భాగంగా వ్యాపార దుకాణాలు వద్ద మాస్కులు వాడాలని లేకపోతే పెనాల్టీ విధించాలన్నారు.


ఈ సమావేశంలో డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్, నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి, డిఆర్డీఏ పిడి నరసింహారెడ్డి, జెడ్పి సిఈఓ భాస్కర్ రెడ్డి, డిటిసి శివరాం ప్రసాద్, డి సి హెచ్ ఎస్ రమేష్ నాథ్, టూరిజం జిల్లా మేనేజర్ దీపక్, ఏపీఎంఎస్ఐడిసి ఇఇ, ఆర్డీవోలు నిశాంత్ రెడ్డి, మధుసూదన్, వెంకటరెడ్డి, వరప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్ర, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.