ఆర్టీసీ హౌసులో పాలకవర్గ తొలి సమావేశం

విజయవాడ (ప్రజా అమరావతి);

ఆర్టీసీ హౌసులో పాలకవర్గ తొలి సమావేశం 

APSRTC చైర్మన్ శ్రీ ఏ. మల్లిఖార్జున రెడ్డి  మరియు శ్రీ సి.హెచ్.ద్వారకా తిరుమల రావు, IPS, MD, APSRTC ల ఆధ్వర్యంలో ఈ రోజు అనగా 29.12.2021 న APSRTC పాలక మండలి మొదటి సమావేశం RTC హౌస్ నందు జరిగింది.

పాలక మండలి సభ్యులు 45 అంశాల అజెండాను సుదీర్ఘంగా చర్చించారు. 

APSRTC ప్రస్తుత ఆదాయ వ్యయాల పైన, బస్సుల నిర్వహణ తీరు గురించి, ప్రయాణికులకు మెరుగైన  సదుపాయాల కల్పన గురించి మరియు  ఉద్యోగుల సంక్షేమం కొరకు తీసుకోవాల్సిన భవిష్యత్ ప్రణాళికలు మొదలగు అంశాలు వివరంగా చర్చించ బడినవి.

APSRTC ఉద్యోగులందరూ  ప్రభుత్వంలో విలీనం  కాబడినందున జనవరి 2020 నుండి ఉద్యోగులందరికీ నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి జీతాల చెల్లింపు జరుగుతోంది. ప్రతి నెలా 250 కోట్లు అనగా సాలీనా 3000 కోట్ల వేతన భారం ప్రభుత్వం భరిస్తున్నందున APSRTC కి గణనీయంగా ఆర్ధిక వెసులుబాటు  కలిగింది. మార్చ్ 2020 నుండి నేటి వరకు  10502 ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దురదృష్టవశాత్తు  322 మంది కరోనా కు గురై మరణించారు. కరోనా తీవ్రంగా వున్న కాలంలో కూడా ప్రభుత్వ నిభందనల మేరకు ప్రజలకు మెరుగైన  రవాణా సదుపాయం కల్పించటం లో ఉద్యోగులు వెనుకంజ వేయలేదు. వారి సేవలను బోర్డు సభ్యులు ప్రస్తుతించారు. ఇట్టి విషయాలన్నిటి గురించి  బోర్డు సమావేశంలో చర్చించ బడినవి.

ప్రస్తుతం కరోనా పరిస్థితుల నుండి బయట పడుతున్న నేపథ్యంలో  సంస్థాగతంగా పురోగాభివృద్ది కై  తీసుకోవాల్సిన చర్యలు, ఉద్యోగుల యొక్క బాధ్యతల గురించి విలువైన సూచనలు ఈ సమావేశంలో చేశారు. 

సంస్థలోని బస్ స్టేషన్ లలో సదుపాయాల మెరుగుదల, డిపో లలో సాంకేతిక అంశాలు, ఉద్యోగుల వృత్తి నైపుణ్యాల మెరుగుదల, కొత్త బస్సుల కొనుగోలు మొదలగు అంశాల గురించి కూడా చర్చించి తగు సూచనలు చేశారు. 

ఈ సమావేశానికి పాలకమండలి సభ్యులైన శ్రీ విజయానంద రెడ్డి , వైస్ చైర్మన్ , శ్రీమతి గడాల బంగారమ్మ, విజయనగరం జోనల్ చైర్మన్, శ్రీమతి తాతినేని పద్మావతి, విజయవాడ జోనల్ చైర్మన్, శ్రీమతి సుప్రజ, నెల్లూరు జోనల్ చైర్మన్, శ్రీమతి మాల్యవంతం మంజుల, కడప జోనల్ చైర్మన్ గార్లతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు శ్రీ ఎస్. ఎస్. రావత్, IAS, ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఆర్ధిక శాఖ, శ్రీ యం.టి.కృష్ణ బాబు, IAS, ప్రిన్సిపాల్ సెక్రటరీ, TR&B డిపార్ట్మెంట్, శ్రీ శశి భూషణ్ కుమార్, ప్రిన్సిపాల్ సెక్రటరీ, GAD; కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు శ్రీ పరేష్ కుమార్ గోయల్ , IAS, MORTH, న్యూ ఢిల్లీ, శ్రీ కె.వి.ఆర్.కె.ప్రసాద్, డైరెక్టర్, CIRT, పుణె,  శ్రీ ఆర్.ఆర్.కె.కిషోర్, ఇ.డి, ASRTU, మరియు APSRTC ఎక్జిక్యూటివ్ డైరెక్టర్లు , FA&CAO లు పాల్గొన్నారు.