కాకాణి చేతుల మీదుగా రైతులకు ఎరువుల పంపిణి

 *"కాకాణి చేతుల మీదుగా రైతులకు ఎరువుల పంపిణి


"*



*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలంలో పర్యటించి పలు కార్యక్రమాలను ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*


*రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు ఎరువులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.*


*మహిళల సంఘ బంధాలకు 97 కోట్ల 69 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.*


*మహిళలకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాణి.*


*జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.*


*దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందించిన ఎమ్మెల్యే కాకాణి*


*నూతనంగా ఎంపికైన వాలంటీర్లకు నియామక పత్రాలను అందించిన ఎమ్మెల్యే కాకాణి.*




 మహిళలకు లబ్ధి కలిగించే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మహిళా సాధికారతే  ధ్యేయంగా పని చేస్తున్నాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలోని సంఘబంధ మహిళలు, తాము తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తుండడంతో బ్యాంకులు విరివిగా రుణాలు అందిస్తున్నాయి.


 సర్వేపల్లి నియోజకవర్గంలో మహిళలు పెరటి కోళ్ల పెంపకం పట్ల ఆసక్తి కనబరచడంతో  726 కుటుంబాలకు రూ. 29 లక్షల విలువైన పెరటి కోళ్లను పంపిణీ చేస్తున్నాం.


 తెలుగుదేశం హయాంలో *"వ్యవసాయం దండగ"* అన్న పెద్ద మనుషులు రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తారు.


 రైతులను నట్టేట ముంచి, ఓటమిపాలైన తర్వాత రైతుల పట్ల కపట ప్రేమ కనపరుస్తున్నారు.


 భారీ వర్షాలకు వరదలు వచ్చినప్పుడు తాము సహాయం అందించామని చెప్పుకునే వాళ్ళు, 5సంవత్సరాలు మంత్రిగా వెలగబెట్టినవారు కొట్టుకుపోయిన జాతీయ రహదారిని పునర్నిర్మించ లేకపోయారు.


 వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అధికారపార్టీ శాసన సభ్యునిగా జాతీయ రహదారి పనులు ప్రారంభించి, నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తుంది.


 తెలుగుదేశం హయాంలో వర్షాలు కురిసి వరదలు వస్తే, ఇళ్లలోకి నీరు వచ్చే పరిస్థితిని గమనించి, అధికార పార్టీ శాసన సభ్యునిగా పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మించడంతో ప్రజల ఇళ్లల్లోకి నీరు రాకుండా చేశాం.


 దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉన్నా, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి, సర్వేపల్లి నియోజకవర్గంలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.


 రైతాంగానికి అవసరమైన ఎన్ని ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 30 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం.


👉 సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ శాసన సభ్యునిగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 30 నెలల కాలవ్యవధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేశాం.


👉 సర్వేపల్లి నియోజకవర్గంలో నన్ను ఆదరించి, రెండు సార్లు శాసన సభ్యునిగా అవకాశం కల్పించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి నా శాయశక్తులా కృషి చేస్తా.

Comments