*అర్హులైన ప్రతిఒక్కరికీ.. ప్రభుత్వ లబ్ది*
* *రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా*
* *పలు సమస్యలపై ఉపముఖ్యమంత్రికి వినతులు సమర్పించిన ప్రజలు*
కడప, డిసెంబర్ 20 (ప్రజా అమరావతి) : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ లబ్ది చేకూరుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి ఎస్.బీ.అంజాద్ బాషా తెలిపారు. సోమవారం కడపలోని ఆయన నివాస కార్యాలయంలో.. కడప నియోజకవర్గంతో పాటు.. జిల్లాకు చెందిన పలువురు తమ సమస్యలను ఆయనకు నిన్నవించారు.
ఈ సందర్బంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవశఖంలోని అన్ని సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందేవిధంగా చర్యలు చేపడుతోందన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్ని దరఖాస్తులను సచివాలయాల్లోనే మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఒక్కో పథకానికీ ఒక్కో నిర్ణీత గడువునిచ్చి.. వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా సామాజిక సర్వే చేపట్టి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతోందన్నారు. అర్హతలు వున్న ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. ఇది పేదల ప్రభుత్వం అని, దళారీ వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఎక్కడా ఉండదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నో కొత్త సంక్షేమ పథకాలను మన ముందుకు తెచ్చారని, ఆ పథకాల ఫలాలను అందుకుని ప్రతి ఒక్కరూ సామాజికంగా అభివృద్ధి బాటలో పయనించాలని కోరారు.
ఈ నెల 21న జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారన్నారు. ఈ పథకం ద్వారా.. గతంలో రాష్ట్ర ప్రభుత్వ గృహనిర్మాణ పథకం ద్వారా.. ఇంటి రుణాలు పొందిన లబ్దిదారులకు శాస్వితంగా ఋణవిముక్తి కలగడంతో పాటు... వారి గృహాలపై సర్వహక్కులు లభించనున్నాయన్నారు. ఇప్పటికే.. జిల్లాలో దాదాపు లక్షకు పైగా మంది లబ్దిదారులయిన మహిళలలకు ఇంటిపట్టాలను పంపిణీతో పాటు.. విడతల వారీగా.. గృహాలను కూడా నిర్మించి ఇవ్వడం జరుగుతోందన్నారు.
కోవిడ్-19 దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి.. భౌతిక దూరం, స్వీయ ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ.. పరిశుభ్రత పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ల కార్పొరేటర్లు, వైకాపా నేతలు, నియజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment