శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి): ఈరోజు అనగా ది. 25-12-2021 న దేవస్థానమందు భవానీ దీక్షావిరమణ మహోత్సవములు అత్యంత వైభవముగా ప్రారంభమయినవి. భవానీ దీక్షావిరమణలలో మొదటి రోజు అనగా ది.25-12-2021 న ఉదయం 08.00 గం.లకు శ్రీ అమ్మవారి దర్శనము ప్రారంభమయి, ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివ ప్రసాద శర్మ మరియు వైదిక కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యములో శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ ఉ.08.30 నిం.లకు అగ్ని ప్రతిష్ఠాపన చేసి, హోమగుండములు వెలిగించారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణు భట్ల శివ ప్రసాద శర్మ మరియు వైదిక కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యములో ఉదయం ప్రారంభించిన చండీయాగం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి వారు, ఆలయ ప్రధానార్చకులు శ్రీ లింగంబొట్ల దుర్గాప్రసాద్ పాల్గొని అత్యంత భక్తీ శ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి వారితో పాటు ఆలయ వైదిక కమిటీ సభ్యులు శ్రీ లింగంబోట్ల దుర్గాప్రసాద్ , శ్రీ కోట రవి , శ్రీ ఆర్.శ్రీనివాస శాస్త్రి మరియు ఇతర అర్చక సిబ్బంది పాల్గొన్నారు. భక్తులు వినాయక గుడి నుండి ప్రారంభమయ్యే క్యూలైన్లు ద్వారా ఘాట్ రోడ్ మీదుగా దేవస్థానము చేరుకొని, అమ్మవారిని దర్శించుకొని, శివాలయము మెట్ల మార్గం ద్వారా క్రిందకి చేరుకుని, హోమగుండం ఎదురుగా ఏర్పాటు చేసియున్న ఇరుముడి పాయింట్లు వద్ద భక్తులు ఇరుముడులు సమర్పించి, ముడుపులు, కానుకలు సమర్పించుకుంటున్నారు. భవానీ దీక్ష విరమణల సందర్భముగా ది.25-12-2021 నుండి ది.30-12-2021 వరకు దేవస్థానము నందు నిర్వహించు అన్ని ఆర్జిత సేవలు దేవస్థానము తరుపున మాత్రమే నిర్వహించడము జరుగుచున్నది. భక్తుల సౌకర్యార్థము భక్తుల యొక్క గోత్ర నామములపై పూజ జరిపించుకోనుటకు(పరోక్షముగా మాత్రమే) గాను దేవస్థానము వారు అన్ని ఆర్జిత సేవలు పరోక్ష సేవలుగా నిర్వహించుచూ, www.aptemples.ap.gov.in ద్వారా అందుబాటులో ఉంచటము జరిగినది. పూజ జరిగిన అనంతరం సదరు సేవ యొక్క ప్రసాదములు భక్తులకు పోస్ట్ ద్వారా భక్తుల అడ్రెస్స్ కు పంపడము జరుగునని తెలిపారు. రేపటి నుండి ఉదయం 03 గం.ల నుండి రాత్రి 10 గం.ల వరకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించనున్నట్లు తెలిపారు.
addComments
Post a Comment