శ్రీ విఘ్నేశ్వర స్వామికి డిప్యూటీ సీఎం ధర్మానతో కలిసి మంత్రి కొడాలి నాని పూజలు
- శ్రీ విఘ్నేశ్వర స్వామికి డిప్యూటీ సీఎం ధర్మానతో కలిసి మంత్రి కొడాలి నాని పూజలు 


- పూర్ణకుంభంతో ఆలయ అర్చకుల స్వాగతం 

- స్వామివారికి చామర, వింజామరల సేవలు 

- ధర్మాన, కొడాలి నానిలకు వేద పండితుల ఆశ్వీరచనం గుడివాడ, డిసెంబర్ 30 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులోని శ్రీవిఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు గోపాలశాస్త్రి, రామయ్య, అశోక్ లు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. ధర్మానతో కలిసి మంత్రి కొడాలి నాని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రి కొడాలి నానిలు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీవిఘ్నేశ్వర స్వామికి అభిషేకాలు జరిపారు. చామరలు, వింజామరలతో స్వామివారికి సేవలు చేశారు. ధర్మాన, కొడాలి నానిలను శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు. వేద మంత్రాల నడుమ ఆలయ అర్చకులు వేదాశీర్వచనాన్ని అందజేశారు. అనంతరం ధర్మాన, మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ శ్రీవిఘ్నేశ్వర స్వామి కృపతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రాష్ట్రాన్ని సీఎం జగన్మోహనరెడ్డి ప్రగతి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలూ శ్రమిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డికి శ్రీ విఘ్నేశ్వర స్వామి అండగా ఉంటూ ఆశీస్సులను అందజేయాలని ధర్మాన, కొడాలి నానిలు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలడుగు రాంప్రసాద్, వల్లూరుపల్లి సుధాకర్, చింతల భాస్కరరావు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గంటా చంద్రశేఖర్, ధర్మకర్తలు బంటుపల్లి సూర్యనారాయణ, సిద్ధాబత్తుల లక్ష్మీ నీలవేణి, రాధిక, ఆలయ కార్యనిర్వహణాధికారి వీవీ ప్రసాద్, దేవాదాయశాఖ సిబ్బంది మురళి తదితరులు పాల్గొన్నారు.

Comments