తణుకు (ప్రజా అమరావతి) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి
తణుకు పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు
తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు అధికారులకు తెలిపారు.
స్థానిక జిల్లా పరిషత్ హై స్కూలు ప్రాంగణా నికి శనివారం సాయంత్రం హైదరాబాద్ నుండి వచ్చిన వెంటనే చేరుకుని గత 24 గంటల్లో జరిగిన పనులను సమీక్షించారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రివర్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తో పాటుగా సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు , జి శ్రీనివాస్ నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment