*నృసింహుని సన్నిధిలో నందమూరి బాలకృష్ణ*
గుంటూరు (ప్రజా అమరావతి); మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అఖండ చిత్ర బృందం ప్రతినిధులు ప్రతినిధిలు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీంద్ర రెడ్డి, చిత్ర బృందం ప్రతినిధులకు ఆలయ అధికారులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. మొదటిగా లక్ష్మీ నృసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించారు. బాలకృష్ణ, ఇతర చిత్ర బృందాన్ని చూసేందుకు ఆలయం వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
addComments
Post a Comment