కోడి పందేల నిర్వహణపై నిషేధం

 


కొవ్వూరు (ప్రజా అమరావతి); 



సంక్రాంతి పండుగ సందర్భంగా కొవ్వూరు డివిజన్ వ్యాప్తంగా కోడి పందేల నిర్వహణపై  నిషేధం విధించడం జరిగిందని , అదేవిధంగా కోవిడ్ నేపథ్యంలో గుంపులు గుంపులు గా గుమీకూడరాదని ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు.


శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందాలు, పేకాట, గుండాట వంటి ఆటలపై  నిషేధం విధించడం జరిగిందన్నారు. పోలీసులు ఆధ్వర్యంలో  ఎవరైతే కోడి పందాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి నిషిద్ధం చేసిన ఆటలు నిర్వహిస్తారో వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఫంక్షన్ హాల్స్, తోటలు వంటి ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తే వాటి యజమానులపై కూడా కేసులు నమోదు చెయ్యడం జరుగుతుందని హెచ్చరించారు. కోవిడ్ పరిస్థితి, ఒమీక్రాన్ వ్యాప్తి హెచ్చరికలు మేరకు, కోవిడ్ మార్గదర్శకాలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.  కోడి పందేలు నిర్వహణ కి ప్రోత్సహించడం, .నిర్వహించాడం చేస్తే  గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని మల్లిబాబు అన్నారు.



Comments