తాడేపల్లి (ప్రజా అమరావతి); కెఎల్ విశ్వవిద్యాలయంలో గణితం విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సు కు ముఖ్య అతిథిగా నిమ్స్-ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్ధన్ రావు, మలేషియా కు చెందిన మలయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్ రామన్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రతి మనిషి జీవితంలో విడదీయరాని అనుబంధం ఉన్న సబ్జెక్టు గణితమని
, దానిపై పట్టు సాధించడం ఉన్నతికి బాటలు వేసుకోవడమేనని అన్నారు.గణితశాస్త్ర జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఎదురవుతున్న సవాళ్ళ పరిష్కారానికి వినియోగించాలని పిలుపునిచ్చారు.విద్యార్థి దశనుంచే గణిత శాస్త్రాన్ని నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఇంజనీరింగ్ అయ్యేందుకు కాకుండా ప్రతి ఒక్క పనిలో గణితం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ అవ్వాలనుకునే విద్యార్థులు గణితం మీద మంచి పట్టు కలిగివుండాలని విద్యార్థులకు సూచించారు. గణిత శాస్త్రం మొదటి నుంచి ప్రాముఖ్యత కలిగివున్నదని ఉన్నదని తెలిపారు. గణితశాస్త్రం పరిశోధన మరియు విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణ రంగాలలో అభివృద్ధి చెందుతుందని, పురోగమనాల యొక్క పరిణామాలను అంచనా వేయటానికి సామర్ధ్యం కలిగి ఉండటానికి ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదైనా సమస్యను పరిష్కరించెందుకు గణితశాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుందని, గణిత శాస్త్రం మరియు సాంకేతిక రంగాలను కూడ విస్తరించడంలో గణితశాస్త్రం కీలకపాత్ర పోషించిందని స్పష్టం చేసారు. పరిశోధన యొక్క అవసరాన్ని గణనీయంగా అంచనా వేయడానికి మరియు ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేయడానికి గణిత శాస్త్రం ప్రాముక్యత ఉందని అన్నారు. గణితశాస్త్రం యొక్క ప్రాముఖ్యత మరియు గణిత శాస్త్రం యొక్క ఉపయోగాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సదస్సుకు సుమారు 200 మంది విద్యార్థులు రిసోర్స్ పర్సన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప కులపతి డాక్టర్ సారధి వర్మ, రిజిస్టార్ డాక్టర్ వైవిఎస్ఎస్వి ప్రసాద్ రావు,డైరెక్టర్ అండ్ సిసిఓ డాక్టర్ జగదీష్, గణితం విభాగం విభాగాధిపతి డాక్టర్ బివి.అప్పారావు,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
Post a Comment