అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
విద్యార్థులందరికి వైద్య పరీక్షలు చేయండి.
తరగతి గదులు శానిటైజేషన్ చేయండి.
అమరావతి (ప్రజా అమరావతి): కృష్ణా జిల్లా మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో మాట్లాడారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు ఆర్డీఓ తో మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో 14 మంది విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారని, వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ జ్వరాలతో అస్వస్థతకు గురైనట్టు అధికారులు మంత్రికి తెలిపారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యా, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అందరు విద్యార్థులకు ఆర్టిపిసిఆర్ పరీక్షలు చేయించాలని ఆదేశించారు. 14 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థుల అస్వస్థతపై మంత్రి నివేదిక కోరారు. వైద్య సేవల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. తరగతి గదులు శానిటేషన్ చేయాలని చెప్పారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇచ్చి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి సమీక్షించాలన్నారు. నీటి వసతులు, వాటర్ ట్యాంక్ ల పరిశుభ్రత పై ద్రుష్టి సారించాలని అన్ని జాగ్రత్తలతో అధికారులు అప్రమత్తం గా ఉండాలని ఆదేశించారు.
addComments
Post a Comment