శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి): దేవస్థానము నందు ఉపాలయమైన శ్రీ నటరాజ స్వామివారి ఆలయము వద్ద " శ్రీ శివ కామ సుందరీ సమేత నటరాజ స్వామి వారి ఆర్ద్రోత్సవ కళ్యాణోత్సవము ది.18-12-2021 నుండి ది.20-12-2021" వరకు జరుగుటలో భాగముగా ఈరోజు అనగా ది.18-12-2021, శనివారము రోజున ఉదయం 08.00 లకు ఆలయ స్తానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ , ఆలయ వైదిక కమిటీ సభ్యులు శ్రీ లింగంభొట్ల దుర్గాప్రసాద్ మరియు శ్రీ ఆర్.శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యములో శ్రీ వినాయక స్వామి వారికి, శివకామ సుందరీ సమేత నటరాజ స్వామివార్లకు శాస్త్రోక్తముగా మంగళ స్నానములు ఆచరింపజేసి, వధూవరులుగా అలంకరించడము జరిగినది.
ఈ కార్యక్రమములో శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ పాల్గొని అత్యంత భక్తీ శ్రద్దలతో పూజాది కార్యక్రమములు శాస్త్రోక్తముగా నిర్వహించి, శ్రీ శివ కామ సుందరీ సమేత నటరాజ స్వామి వార్లకు పట్టు వస్త్రములు సమర్పించారు.
అనంతరం సాయంత్రం 04 గం.ల నుండి అంకురార్పణ మంటపారాధన, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణ, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం మరియు తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమములు నిర్వహించడము జరిగినది.
addComments
Post a Comment