- విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సెర్ప్, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ అధికారులతో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష
- సమావేశంలో పాల్గొన్న సెర్ప్ సిఇఓ ఇంతియాజ్, పిఆర్ అండ్ ఆర్డీ స్పెషల్ కమిషన్ శాంతిప్రియ పాండే, స్వచ్చంధ్ర కార్పోరేషన్ సిఇఓ డాక్టర్ సంపత్ కుమార్ తదితరులు.
విజయవాడ (ప్రజా అమరావతి):
- రాష్ట్రంలో సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ (ఎస్‌డబ్ల్యుపిఎస్) లను నూరుశాతం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్వచంధ్ర కార్పోరేషన్ అధికారులను ఆదేశించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామ సచివాలయాల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- రాష్ట్రంలో 9800 ఎస్‌డబ్ల్యుపిఎస్ లు ఉండగా 1600 సెంటర్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయని మంత్రికి వివరించిన స్వచ్చంధ్ర కార్పోరేషన్ అధికారులు.
- మరో 478 సెంటర్‌లకు రహదారి సదుపాయం లేని విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చిన అధికారులు.
- వెంటనే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి రహదారి ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి
- జగనన్న స్వచ్చ సంక్పలంలో భాగంగా రాష్ట్రంలోని సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్లను అన్ని చోట్ల వినియోగంలోకి తీసుకురావాలన్న మంత్రి
- తడి, పొడి చెత్తలను ప్రతి ఇంటి నుంచి వేరువేరుగా సేకరించేందుకు ఉచితంగా డస్ట్ బిన్‌లను అందించాలన్న మంత్రి
- ఇప్పటికే డస్ట్‌బిన్‌ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో అన్ని గ్రామాల్లోనూ దీనిని కొనసాగించాలని, డస్ట్ బిన్‌ల కొనుగోళ్ళకు సంబంధించి ఇంకా కొన్ని జిల్లాల్లో టెండర్ల ప్రక్రియ నిదానంగా జరుగుతోందని, దానిని వేగవంతం చేయాలన్న మంత్రి
- గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రతలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని, చెత్త సేకరణ వాహనాల్లో తమ ఇళ్ళలోని చెత్తను తడి, పొడి చెత్తలు వేరుచేసి ఇచ్చే అలవాటును ప్రోత్సహించాలని అధికారులకు సూచించిన మంత్రి
- ఇంకా అవసరమైన చోట్ల సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని, అందుకు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించిన మంత్రి
- ఈ సెంటర్ల ద్వారా తడిచెత్త నుంచి వర్మీకంపోస్ట్‌ను తయారు చేసుకుని, రైతులకు అందుబాటు ధరలో విక్రయించడం వల్ల పంచాయతీలకు అదనంగా ఆధాయం సమకూరుతుందన్న మంత్రి
- రైతులకు సేంద్రియ ఎరువులను గ్రామస్థాయిలోనే అందించే వీలుందని సూచించిన మంత్రి
- అలాగే పొడిచెత్త నుంచి ప్లాస్టిక్, కాగితాలు, గ్లాస్ మెటీరియల్‌ను వేరుచేసి, వాటిని కూడా రీప్రాసెసింగ్ సెంటర్ లకు విక్రయించవచ్చని, ఇప్పటికే పలు సంస్థలు ఇటువంటి మెటీరియల్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని అని, అధికారులు దీనిపై దృష్టి సారించాలన్న మంత్రి
- గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వైయస్‌ఆర్ ఆసరా, వైయస్‌ఆర చేయూత, వైయస్‌ఆర్ పెన్షన్ కానుక పథకాలపై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డ సమీక్షించారు.
- డిసెంబర్ నెలలో పెన్షనర్లకు నిర్ధిష్టకాలంలోనే 98.8 శాతం పెన్షన్‌ను పంపిణీ చేయడం పట్ల అధికారులను అభినందించిన మంత్రి
- ఇదే విధంగా ప్రతి నెలా ఒకటి నుంచి అయిదో తేదీ వరకు మొత్తం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించిన మంత్రి
- ఆసరా, చేయత కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో మహిళలు వ్యాపార, ఉపాధి రంగాల్లో ప్రగతిని సాధించేందుకు తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించిన మంత్రి.
addComments
Post a Comment