*మోస పూరిత హామీలతో ముంచేశారు
*
*బేతంచర్ల మున్సిపాలిటీ నేతలతో నారా చంద్రబాబు నాయుడు సమీక్ష*
గుంటూరు (ప్రజా అమరావతి) : కర్నూలు జిల్లా బేతంచర్ల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన, గెలిచిన అభ్యర్ధులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల వ్యవస్థ ప్రహసనంలా మారిపోయిందని, గతంలో ఎన్నడూ చూడని పోకడను ఎన్నికల్లో చూస్తున్నామన్నారు. రాజకీయాలను క్రిమినలైజ్ చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు పోటీలో ఉండకుండా చేసేందుకు అన్ని రకాల కుట్రలూ చేశారని, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు, చివరికి ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణకూ దిగారు. గతంలో గెలిచిన తర్వాత క్యాంపులు పెట్టి కాపాడితే.. ఇప్పుడు నామినేషన్లు వేసేందుకు కూడా క్యాంపులు పెట్టాల్సిన పరిస్థితి కల్పించారు. పోటీ చేసిన వారిని, వారికి మద్దతిచ్చిన వారిని కూడా హింసిస్తున్నారు. నాయకుల గత చరిత్ర కంటే.. ప్రజలలో వారికి ఉన్న ఆదరాభిమానాలే ఓట్లు వేసేలా చేస్తాయి.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రాన్ని, నియోజకవర్గాలను అభివృద్ధి చేయడంపైనే దృష్టి పెట్టాం. కానీ జగన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం పట్టడం లేదు. ఎంతసేపూ ప్రతిపక్ష సభ్యులను వేధించడమే ధ్యేయంగా పని చేస్తున్నారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక నిండా ముచేశారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
అభ్యర్ధులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రోజు తెలుగుదేశం పార్టీ తరఫున క్రియా శీలంగా పని చేసే నాయకులను అరెస్టు చేశారని, పోలీసులే దగ్గరుండి డబ్బులు పంచడం ఎన్నడూ చూడలేదన్నారు. కలెక్టర్, ఆర్వోకు ఫిర్యాదులు చేసినా స్పందించడమే లేదు. దొంగ ఓట్లు వేస్తున్నారని పోలీసులకు చెబితే.. కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో యధేచ్ఛగా దొంగ ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ప్రతి చోటా పోలీసుల్ని వాడుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. దొంగ ఓటర్లను తెచ్చారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని కనీసం పోలింగ్ కు కూడా రాకుండా చేశారని పలువురు నేతలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు లేకుండా ఎన్నికలు జరిపే పరిస్థితి ఉంటే.. వైసీపీ అభ్యర్ధులకు కనీసం డిపాజిట్లు కూడా ఉండవన్నారు.
సార్వత్రిక ఎన్నికల నాటిక ప్రజల్లో తిరిగే ప్రతి నాయకుడికీ అవకాశాలు కల్పిస్తామని, అధికార పార్టీ నేతల అరాచకాలు, పోలీసుల దౌర్జన్యాలపై పోరాడి గెలుద్దామని చంద్రబాబు నాయుడు నేతలకు సూచించారు. ఎవరెన్ని దౌర్జన్యాలకు పాల్పడినా.. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురులేదని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.
addComments
Post a Comment