ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలి: సీఎం


అమరావతి (ప్రజా అమరావతి);


*వ్యవసాయ అనుబంధ రంగాలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.* 


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే....:* 


ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలి: సీఎం


బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుఅయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించాలి:

 ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలి : అధికారులకు సీఎం నిర్దేశం

వరి పండిస్తే వచ్చే ఆదాయం... మిల్లెట్స్‌ పండిస్తే కూడా వచ్చేలా చూడాలి:

దీనికోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి :

ఈ అంశంపై సరైన అధ్యయనం చేసి రైతులకు అండగా నిలవాలి :

మిల్లెట్స్‌ పండించినా రైతులకు మంచి ఆదాయం వచ్చే విధానాలు ఉండాలి : 

మిల్లెట్స్‌ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి: సీఎం ఆదేశం

మిల్లెట్స్‌ను అధికంగా సాగుచేస్తున్న ప్రాంతాల్లో ప్రాససింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి:

దీంతోపాటు సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలి :

సేంద్రీయ, ప్రకృతిసేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలి :

రసాయన ఎరువులు, పురుగుమందులు స్థానే ప్రత్యామ్నాయంగా సేంద్రీయ పద్ధతులద్వారా పంట సాగును ప్రోత్సహించాలి.

రసాయనాలు లేని సాగుమీద మంచి విధానాలను తీసుకురండి : అధికారులకు సీఎం ఆదేశం 

ఆర్బీకే యూనిట్‌గా ఆర్గానిక్‌ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి:

ఆర్బీకే పరిధిలో ఏర్పాటుచేస్తున్న సీహెచ్‌సీలో కూడా ఆర్గానిక్‌ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను ఉంచాలి :

సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన పరికరాలు, మందులు, సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలి :


ఆర్బీకేల ద్వారా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సర్టిఫికేషన్‌కూడా ఇచ్చేలా వ్యవస్థ రావాలి : సీఎం 


*ఖరీఫ్‌లో 1.12 కోట్ల  ఎకరాల ఇ–క్రాప్‌*

45,35,102 మంది రైతులు ఇ– క్రాప్‌ చేయించుకున్నారు.

రబీలో ఇ– క్రాప్‌ ప్రక్రియను ప్రారంభించాం : సీఎంకు తెలిపిన అధికారులు


*కల్తీపై కఠిన చర్యలు*

రైతులకు కల్లీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు: అధికారులకు స్పష్టం చేసిన సీఎం

రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు :సీఎం

దీనికోసం చట్టంలో మార్పులు, అవసరమైతే ఆర్డినెన్స్‌ :

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందించాలన్న ఒక సదుద్దేశం.. క్రమంగా ఆర్బీకేల ఏర్పాటుకు దారితీశాయి :

వీటిని నీరేగార్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయి :

ఈ వ్యవహారాల్లో ఉద్యోగులు ప్రమేయం ఉంటే.. వారిని తొలగించడమే కాదు.. చట్టంముందు నిలబెడతాం :

అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారులపైనా కఠిన చర్యలు ఉంటాయి:


రైతులకు ఎక్కడా విత్తనాలు అందలేదనే మాట రాకూడదు :

డిమాండ్‌ మేరకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలి:


*కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు*

కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో ఉంచాల్సిన పరికరాలపై హేతుబద్ధత ఉండాలి :

రైతులకు అందించాల్సిన పరికరాలు కూడా రైతుల సంఖ్య, సాగు చేస్తున్న భూమి , వేస్తున్న పంటల ఆధారంగా హేతుబద్ధతతో వాటిని అందుబాటులోకి తీసుకురావాలి :

దీనిపై మ్యాపింగ్‌ చేయాలని అధికారులకు సీఎం ఆదేశం


*ఆర్గానిక్‌ ఫీడ్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌* 

పశువులకు ఆర్గానిక్‌ ఫీడ్‌ కూడా అందుబాటులో ఉండాలి:

ఆర్గానిక్‌ మిల్క్‌పైన మార్కెటింగ్‌పైన  దృష్టి పెట్టండి:

దీనివల్ల రైతులకు మంచి ఆదాయాలు లభిస్తాయి:

అలాగే ఆర్గానిక్‌ఉత్పత్తుల ప్రాససింగ్‌పైన కూడా దృష్టి పెట్టండి:

జిల్లాకు ఒక ప్రాససింగ్‌ యూనిట్‌కూడా పెట్టేలా చర్యలు తీసుకోవాలి:


*జగనన్న పాలవెల్లువ కార్యక్రమంపైనా సీఎం సమీక్ష*

పాలవెల్లువ కార్యక్రమం ప్రగతిపై సీఎంకు వివరాలందించిన అధికారులు

డిసెంబరులో కృష్ణా, అనంతపురం జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం

పాలవెల్లువ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ 1,77,364 మహిళలకు లబ్ధి

సగటున రోజువారీ పాలసేకరణ నవంబర్, 2020లో 2,812 లీటర్లు, నవంబర్‌ 2021లో 71,911 లీటర్లు.

ఇప్పటివరకూ 1కోటి 32లక్షల లీటర్ల పాలు కొనుగోలు 


ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ఛైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్టారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయం, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూదన్‌రెడ్డి, పుడ్‌ ప్రాసెసింగ్‌ కార్యదర్శి ఎం కె మీనా, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఎండీ పీఎస్‌ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, ఏపీడీడీసీఎఫ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ బాబు, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments