సభా ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీవో మల్లిబాబు తెలిపారు



తణుకు (ప్రజా అమరావతి);   


ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణం, చురుగ్గా పనులు జరుగుతున్నాయని శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. 



 గురువారం తణుకు జెడ్పి హై స్కూల్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం నిర్వహించనున్న  బహిరంగ సభ వేదిక, తదితర పనుల ను పర్యవేక్షణ చేశారు. డిసెంబర్ 21  మంగళవారం ఉదయం హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ జరిగే వేదిక వరకు ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలికడం జరుగుతుందని శాసన సభ్యులు తెలిపారు. ఎస్ కె ఎస్ మహిళా కళాశాల ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చెయ్యడం జరిగిందని శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. 


సభా ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంపూర్ణ గృహ హక్కు పధకాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభిస్తూన్న దృష్ట్యా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సభా ప్రాంగణంలో భూమి లేవిలింగ్ పనులు, సభా వేదికపనులు సమాంతరంగా  చేపడుతున్నట్లు తెలిపారు. 

 



Comments