త్వరితగతిన పునరుద్ధరణ పనులు*
*: జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*
ముదిగుబ్బ (అనంతపురం), డిసెంబర్ 09 (ప్రజా అమరావతి):
జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులు, తాగునీటి పైపులైన్ల పునరుద్ధరణ పనులు త్వరితగతిన చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. గురువారం ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు వద్ద దెబ్బతిన్న బ్రిడ్జి, పైప్ లైన్ పనులకు సంబంధించి చేపడుతున్న మరమ్మతు పనులను, మల్లేపల్లి క్రాస్ నుంచి మల్లేపల్లి గ్రామానికి వెళ్లే దారిలో దెబ్బతిన్న బ్రిడ్జిలను, కదిరి - అనంతపురం జాతీయ రహదారిపై నాగారెడ్డిపల్లి బ్రిడ్జి వద్ద భారీ వర్షాలకు దెబ్బతిన్న తాగునీటి పైప్ లైన్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత నవంబర్ 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురవడం వల్ల చిత్రావతి నది పరిధిలో ఉన్న ప్రాజెక్టులు నిండి ఎక్కువ స్థాయిలో నీరు ప్రవహించడంతో ఆర్అండ్ బి రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో తాగునీటి పైపులైన్లు, పంచాయతీరాజ్ రహదారులు దెబ్బతినడం జరిగిందని, కొన్ని గ్రామాలకు కనెక్టివిటీ దెబ్బతిందన్నారు. ఇందుకు సంబంధించి ముదిగుబ్బ మండలంలోని కొడవాండ్లపల్లి, దొరిగల్లు గ్రామాల వద్ద చిత్రావతి నదిపై బ్రిడ్జిలు ఉన్నా వాటిపై నీరు ప్రవహించడంతో బ్రిడ్జిలు, తాగునీటి పైప్లైన్ లు దెబ్బతినడం జరిగిందని, వాటిని పరిశీలించామని, ఆర్ఆర్బి పరిధిలో తాత్కాలిక మరమ్మతులు పనులు చేపట్టడం జరిగిందన్నారు. అయితే యోగివేమన జలాశయం నుంచి నీటి రాక ఉండడంతో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, ఈ విషయమై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడటం జరిగిందని, ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించాలని, బ్రిడ్జిల మరమ్మతు పనులు త్వరగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో దొరిగల్లు, నాగారెడ్డిపల్లి బ్రిడ్జి వద్ద తాగునీటి పైపులైన్లు దెబ్బతినడం జరిగిందని, ఈ తాగునీటి పైప్లైన్ల ద్వారా డి పేరు ఏంటి ఫోన్ పాస్వర్డ్ చెప్పు డిపిఆర్ఓ మెయిల్ అడ్రస్ పాస్వర్డ్ చెప్పు కదిరి డివిజన్ పరిధిలోని 5 - 6 మండలాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని, ప్రస్తుతం ఆయా మండలాల వారికి స్థానికంగా నీటి వనరులు ఉన్నా, దెబ్బతిన్న తాగునీటి పైప్లైన్ లను మరమ్మతు పనులు పూర్తి చేస్తే వారు ఆయా మండలాల వారికి పూర్తిస్థాయి తాగునీటి సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. తాగునీటి పైపులైన్లు మరమ్మతు పనులకు సంబంధించి రెండు రోజుల లోపు ఒక చోట మరమ్మతు పనులు పూర్తి కావడం జరుగుతుందని, మరోచోట వారం రోజుల్లోపు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ ముదిగుబ్బ - దొరిగల్లు రహదారిలో దొరిగల్లు గ్రామం వద్ద భారీ వర్షాలకు దెబ్బతిన్న తాగునీటి పైప్లైన్ పనులను పరిశీలించి శుక్రవారం సాయంత్రంలోపు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోజువారీగా ప్రణాళిక రూపొందించుకుని పనులను చేపట్టాలన్నారు. దొరిగల్లు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు జాగ్రత్తగా చేయాలని, వాహనాలను దారి మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం వద్ద దెబ్బతిన్న తాగునీటి పైప్లైన్ పనులను పూర్తి చేయడం ద్వారా ముదిగుబ్బ ప్రాంతంలోని 52 గ్రామాలకు, నల్లమడ మండలం లో లో 54 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు అవకాశం ఉంటుందని, పనులను త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మల్లేపల్లి క్రాస్ నుంచి మల్లేపల్లి గ్రామానికి వెళ్లే దారిలో వర్షాల వల్ల దెబ్బ తిన్న రెండు బ్రిడ్జి లను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలికంగా మరమ్మతు పనులు చేపట్టడం జరిగిందని, ఆ బ్రిడ్జిల వద్ద శాశ్వతంగా మరమ్మతు పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ రూట్ లో వాహనాల డైవర్షన్ చేపట్టాలన్నారు. తదనంతరం నాగారెడ్డిపల్లి బ్రిడ్జి వద్ద భారీ వర్షాలకు దెబ్బతిన్న తాగునీటి పైప్ లైన్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. చిత్రావతి డ్యాం నుంచి కదిరికి తాగునీటిని అందించే సత్యసాయి తాగునీటి పైప్లైన్, మున్సిపాలిటీ పైప్లైన్లు రెండూ కూడా దెబ్బతినగా, వచ్చే వారంలోగా పూర్తి చేసేలా వేగంగా తాగునీటి పైప్లైన్ మరమ్మతు పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్అండ్బి ఎస్ఈ నాగరాజు, పంచాయతీరాజ్ ఎస్ఈ భాగ్యరాజ్, ఆర్డీవో వరప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటరమణ, సత్యసాయి డిఈఈ రాంగోపాల్ రెడ్డి, ఆర్ అండ్ బి డిఈఈ రాజగోపాల్, ఈఈ సంజీవయ్య, జెఈ సలీమ్, ఎస్ఐ సాగర్, దొరిగల్లు ఎంపీటీసీ వెంకటేశ్వర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment