కాకాణి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం

 *"కాకాణి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం


"*



శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో గ్రామ సచివాలయ భవనాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


మనుబోలు యస్.సి.కాలనీలో నూతనంగా నిర్మించిన ఆర్.ఓ.ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.


రైతులకు వరి గడ్డి మోపులు చుట్టు యంత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.




 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడంతోపాటు, సిబ్బందిని నియమించి, సచివాలయ భవనాలను నిర్మించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరిపాలనాపరంగా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


 భారతదేశంలో ఎక్కడలేని విధంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సచివాలయ వ్యవస్థను ఆంధ్రరాష్ట్రంలో స్థాపించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.


 జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థకు వాలంటరీ వ్యవస్థను అనుసంధానం చేసి, అర్హులైన వారందరికీ సమర్థవంతంగా, సంపూర్ణంగా సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారు.


 సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వెచ్చించి సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్లు, తాగునీటి సౌకర్యం, సాగునీటి వసతి కల్పించాం.


 అధికార పార్టీ శాసనసభ్యునిగా 30 నెలల పదవీ కాలంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి, ప్రజలకు అవసరమైన పూర్తిస్థాయి వసతి సదుపాయాలు కల్పించాను.


 అధికార పార్టీ శాసన సభ్యునిగా, మనుబోలు మండలంలో ఎన్నడూ లేని విధంగా 22 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, 15 కోట్ల రూపాయలతో సైడ్ డ్రైన్లు నిర్మించాం.


 వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనుబోలు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మించడంతో, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చినా, ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు.


 సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి, నియోజకవర్గ ప్రజలకు అన్ని వసతి సదుపాయాలు కల్పించడానికి నా సాయశక్తులా కృషి చేస్తా.

Comments