ఐపీఎస్ అధికారి కొమ్మి ప్రశాంత్ శివ కిశోర్ పెళ్లి రిసెప్షన్ కు హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

*ఆత్మకూరుకు చెందిన ఐపీఎస్ అధికారి కొమ్మి ప్రశాంత్ శివ కిశోర్  పెళ్లి రిసెప్షన్ కు హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి**హైదరాబాద్ లో జరిగిన వేడుకలో వధూవరులను ఆశీర్వదించిన మంత్రి మేకపాటి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి*


హైదరాబాద్, డిసెంబర్, 19 (ప్రజా అమరావతి); పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూర్ కి చెందిన ఐపీఎస్ అధికారి  ప్రశాంత్ శివ కిషోర్ వివాహ రిసెప్షన్‌ కు హాజరయ్యారు. మంత్రి మేకపాటి తండ్రి గారైన మాజీ ఎంపీ,  వైసిపి సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డితో కలిసి రిసెప్షన్ లో పాల్గొని నూతన వధూవరులు ఐపీఎస్ కొమ్మి ప్రశాంత్ శివ కిశోర్,  ఐఏఎస్ ధాత్రి రెడ్డిలను ఆశీర్వదించారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి కృషితో ఏర్పాటైన కృష్ణాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో చదివి ఇంతవాడయ్యాడంటూ ఐపీఎస్ అధికారి కొమ్మి ప్రశాంత్ శివ కిషోర్ తండ్రి కొమ్మి నారాయణ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కష్టపడి ఐఏఎస్, ఐపీఎస్ సహా ఎంతో మంది ఉన్నత స్థాయి, పదవులలో ఉన్నారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త జంట ఐఏఎస్, ఐపీఎస్ పోస్టింగుల గురించి మంత్రి మేకపాటి అడిగి తెలుసుకున్నారు.  భవిష్యత్తులో బ్యూరోక్రాట్లుగా ప్రజలకు మరింత సేవ చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి ఆల్ ది బెస్ట్ తెలిపారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా పాల్గొన్నారు. పిలిచినంతనే వస్తానన్న ఒక్క మాటతో కుమారుడి వివాహ రిసెప్షన్ కు  మేకపాటి కుటుంబం మొత్తం తరలిరావడంతో ఐపీఎస్ అధికారి కొమ్మి ప్రశాంత్ శివ కిషోర్ తండ్రి గారైన పడమటికంభంపాడు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొమ్మి నారాయణ సంతోషం వ్యక్తం చేశారు.