భారత రాజ్యాంగ నిర్మాత, దేశంలోని బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బి.ఆర్.అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి. ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు.

నెల్లూరు (ప్రజా అమరావతి);


భారత రాజ్యాంగ నిర్మాత, దేశంలోని బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి  డా. బి.ఆర్.అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి. ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు.




డా.బి.ఆర్.అంబేద్కర్  65వ వర్ధంతిని పురష్కరించుకొని సోమవారం  వి.ఆర్.కళాశాల సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించి భారత రాజ్యాంగాన్ని అందించిన అపర మేధావి డా.బి.ఆర్ అంబేద్కర్ అని, ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ  వారి 65వ వర్ధంతిని పురస్కరించుకొని  వారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు.                       డా. బి.ఆర్.అంబేద్కర్ తొలి కేంద్ర  న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారని కలెక్టర్ తెలిపారు.  దేశంలోనే  కాకుండా ప్రపంచ దేశాలలోనే  తలమానికంగా నిలిచిన భారత రాజ్యాంగాన్ని  మనకు అందించిన మహనీయులు  డా. బి.ఆర్.అంబేద్కర్ అని అన్నారు.  రాష్ట్రాలు ఎలా ఉండాలి, దేశం ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి,  వ్యవస్థ ఎలా పనిచేయాలి,  ఆర్ధిక, సామాజిక, రాజకీయ అన్నీ అంశాలను  క్రోడీకరించి లిఖితపూర్వకంగా రాజ్యాంగాన్ని అందించిన ఘనత డా. బి.ఆర్.అంబేద్కర్ కు  దక్కుతుందన్నారు. అణగారిన వర్గాలను పైకి తీసుకురావడానికి   డా. బి.ఆర్.అంబేద్కర్  కృషి మరవలేనిదన్నారు. భావిభారత పౌరులందరికి జీవన విధానం ఎలా ఉండాలని   తెలిపిన మహానీయులు డా. బి.ఆర్.అంబేద్కర్ అని, వారు  రచించిన  భారత రాజ్యాంగం  ప్రజాస్వామ్య వ్యవస్థకు దిక్సూచి అని   కలెక్టర్ తెలిపారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని  ముందుకెళ్లాలని కలెక్టర్ తెలిపారు. 



ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీమతి రోజ్ మాండ్, నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ హుస్సేన్ సాహెబ్,  డి.డి. సోషల్ వెల్ఫేర్ శ్రీ చిన్నయ్య,   జిల్లా బి.సి.వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ  వెంకటయ్య, జిల్లా విద్యా శాఖాధికారి  శ్రీ రమేష్ కుమార్, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



Comments