తణుకు (ప్రజా అమరావతి);
పశ్చిమగోదావరి జిల్లాలో డిసెంబర్ 21 న తణుకు పట్టణంలో ఒక చారిత్రాత్మక మైన సంపూర్ణ గృహ పధకానికి వేదిక కానుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
గురువారం రాష్ట్రపతి రోడ్డులోని జెడ్పి హై స్కూల్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ,
మన రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని చారిత్రాత్మక మైన నిర్ణయం తీసుకుని పేదలందరికీ శాశ్వత మైన గృహం ఉండాలనే సంకల్పంతో ఓటీఎస్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈపధకం యొక్క ప్రయోజనం ప్రజల్లోకి వెళ్ళాక ముందే , ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తూ ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇది సబబు కాదన్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గృహా రుణాలు పై ఒక్క రూపాయి వడ్డీ తగ్గించలేదు, మాఫీ చెయ్యలేదన్నారు. ఎవరైతే లబ్దిదారుడు ప్రభుత్వం నుంచి అప్పు తీసుకుని, గృహాలు కట్టుకుని, ఈరోజు కి కూడా అప్పు తీర్చలేని పరిస్థితి ఉండి, ఆఇంటి కి పట్టా రాకుండా శాశ్వత హక్కు లేని పరిస్థితి ఉందన్నారు . ఈరోజు మన ముఖ్యమంత్రి పేదల పక్షన్నా నిలబడి, వారికి శాశ్వత హక్కు కలుగచేసి మీకు అండగా ఉండి భరోసా కల్పించే దిశగా ఓటీఎస్ పధకాన్నీ తీసుకుని రావడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ పధకాన్ని రాజకీయ కోణంలో విమర్శలు చెయ్యాలనే తప్ప, పేద ప్రజలకు జరిగే మేలును అడ్డగించే ప్రయత్నం హర్షనీయం కాదన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ పత్రాలు అందచేస్తున్న మన్నారు. ఒకవేళ లబ్దిదారుడు ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అతనికి ఉన్న రెండు మూడు సెంట్ల కి లక్ష రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుంది అన్నది వాస్తవం కాదా అన్నారు. పంచాయతీ ల్లో రూ.10 వేలకు, మునిసిపల్ ప్రాంతాల్లో రూ.15 వేలను ఓటీఎస్ ద్వారా చెల్లిస్తే, ఈ రోజుకి ఆ ఇంటి పై ఉన్న అప్పు మాఫీ చేసి, ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి సంపూర్ణ హక్కు కల్పిస్తూ న్నామని మంత్రి తెలిపారు. ఒకవేళ అప్పు ప్రభుత్వం పేర్కొన్న రూ.10 వేలు కన్నా తక్కువ ఉంటే అమొత్తం చెల్లిస్తే సరిపోతుందన్నారు.
డిసెంబర్ 21 న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా తణుకు పట్టణంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకాన్ని పెద్ద వేడుకగా జరుపు కుంటున్నామని మంత్రి తానేటి వనిత తెలిపారు. స్థానిక శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక పెద్ద వేడుకగా కార్యక్రమం నిర్వహించు కుంటున్నామన్నారు. ఎస్ కె ఎస్ మహిళా కళాశాల ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ పర్యటన లో శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు.
addComments
Post a Comment