ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి , ఈ పధకం యొక్క ప్రయోజనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి

 


కొవ్వూరు (ప్రజా అమరావతి);


ఓటీఎస్ .. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనం సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లుబాబు శనివారం ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు.ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి , ఈ పధకం యొక్క ప్రయోజనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి


అవగాహన కలుగచేసే గురుతరమైన బాధ్యత మనపై ఉందన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం ద్వారా లబ్దిదారుడు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్న వారిని కొందరు ఉద్దేశపూర్వకంగా చెల్లింపులు చెయ్యకుండా ప్రభావం చూపు తున్నారన్నారు. ఈపధకం ద్వారా ఆయా గృహాలు, స్థలలుపై లబ్దిదారులు సంపూర్ణ హక్కులు కల్పించడమే కాకుండా, ఆయా ఆస్తులపై ఉన్న రుణాలు మాఫీ చేయడం జరుగుతుందని మల్లిబాబు పేర్కొన్నారు. వలంటీర్లు.. గ్రామ, వార్డు సచివాలయ, మండల స్థాయి అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి.. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది కి కొందరు లబ్ధిదారులను అనుసంధానం చెయ్యడం, లబ్ధిదారుల ప్రయోజనం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాన్నీ సవివరంగా తెలిపి, లబ్దిదారుడు వాటా మొత్తాన్ని సేకరించాల్సి ఉందన్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలను పూర్తి గా ప్రభుత్వమే మాఫీ చేయడం, లబ్దిదారుడు పేరుతో రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేయాలని సంకల్పం లో ఉన్న వాస్తవాన్ని సమగ్రంగా తెలపాలని కోరారు.కొవ్వూరు డివిజన్ పరిధిలోని 13 మండలాలు, 3 పురపాలక సంఘం పరిధిలో   గుర్తించిన 13621 లబ్ధిదారుల డేటా గ్రామ, వార్డు విఆర్వో, పంచాయతీ సెక్రటరీ, వార్డ్ రెవెన్యూ సెక్రటరీ, సంబంధించిన సిబ్బంది చే ధ్రువీకరణ చెయ్యడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 2,424 మంది లబ్దిదారులు రూ.2,28,55,234 లను ఓటీఎస్ కింద చెల్లించినట్లు ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. 

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ కింద చెల్లింపులు చేసిన వారికి డిసెంబర్‌ 21న ఇంటి స్థలం  పత్రాలను అందచేస్తారని తెలిపారు. . అలాగే వారి పేర్లతోనే రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయించి పూర్తి హక్కులు కల్పిస్తారని పేర్కొన్నారు.