వైఎస్ఆర్ జిల్లా కడప (ప్రజా అమరావతి);
తీవ్ర వాయుగుండంతో గత 12 రోజుల క్రిందట కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత ... కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించే నిమిత్తం గురువారం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో జిల్లా ఇంఛార్జి మంత్రి డా.ఆదిమూలపు సురేష్, ఎంపి మిథున్ రెడ్డి..లతో కలిసి ఉదయం 11.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.
రాష్ట్ర ముఖ్యమంత్రికి కడప విమానాశ్రయంలో స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, డిఐజీ వెంకట్రామిరెడ్డి, శాసన మండలి ఉప చైర్మన్ జఖియా ఖానమ్, ఎమ్మెల్సీ లు రమేష్ యాదవ్, గోవింద రెడ్డి, రామచంద్రయ్య, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డా.సుధ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి, బనాగనిపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం, తదితరులు ముఖ్యమంత్రికి సాదరంగా ఆహ్వానం పలికారు.
అనంతరం కడప విమానాశ్రయం నుంచి ఉదయం 11.20 గంటలకు హెలికాప్టర్ లో బయలదేరి రాజంపేట మండలంలో తీవ్ర వరద ప్రభావిత ప్రాంతాలైన
పులపుత్తూరు, ఎగువ మందపల్లి, అన్నమయ్య సాగర్ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించే నిమిత్తం రాజంపేట మండలం ఎన్ఆర్ పల్లిలోని జవహర్ నవోదయ విద్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు 11.40 గంటలకు చేరుకున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో పాటు జిల్లా ఇంఛార్జి మంత్రి డా.ఆదిమూలపు సురేష్, ఎంపి మిథున్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ రామరాజు హెలికాప్టర్ లో జవహర్ నవోదయ విద్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వద్ద ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్ శ్రీనివాసులు , జిల్లా పరిషద్ చైర్మన్ ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి , ఎమ్మెల్సీ లు వెన్నపూస గోపాల్ రెడ్డి,కత్తి నరసింహా రెడ్డి, రాజంపేట శాసన సభ్యులు మేడా మల్లిఖార్జున రెడ్డి, ఎస్పీ అన్బురాజన్, జేసి (రెవెన్యూ) గౌతమి, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి, తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం రాజంపేట మండలంలో తీవ్ర వరద ప్రభావిత ప్రాంతాలైన పులపుత్తూరు, ఎగువ మందపల్లి, అన్నమయ్య సాగర్ లో పర్యటించే నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు.
addComments
Post a Comment