పిడుగురాళ్ల (ప్రజా అమరావతి); పిడుగురాళ్ల ఎస్సీ బాలికల వసతి గృహము నందు పదవ తరగతి విద్యార్థులకు హెల్ప్ పౌండేషన్( సత్తనపల్లి) ఆధ్వర్యంలో మ్యాథ్స్ స్టడీ మెటీరియల్ పంపిణీ
చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వసతి గృహ సంక్షేమ అధికారి పి సుమని అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా విచ్చేసిన ఉత్తమ ఉపాధ్యాయురాలు గా జిల్లా కలెక్టర్ గారి తో అవార్డు గ్రహీత వరల్డ్ వెల్ బీయింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సేవారంగంలో డాక్టరేట్ పొందిన శ్రీమతి సాం బేలు శాంతి భాయ్ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పరచుకొని, నీ పక్కన ఎవరూ లేక పోయినా, నీ చదివే నిన్ను అందరూ గర్వపడేలా చేస్తుందని చదువును మించిన ఆస్తి లేదని చిన్ననాటి నుంచి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలిపారు. గౌరవ అతిథిగా విచ్చేసిన పిడుగురాళ్ల కు చెందిన శ్రీ క్రిష్ణ డెంటల్ కేర్ హాస్పిటల్ వైద్యులు శివరామకృష్ణ మాట్లాడుతూ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది అని తెలిపారు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాథ్స్ స్టడీ మెటీరియల్ మరియు హాస్టల్లో పనిచేస్తున్న భర్తను కోల్పోయిన వృద్ధులకు చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల బుల్లిబాబు పి పౌల్ ఏష్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
Post a Comment