దివ్యాంగులను చిన్న చూపు చూడకుండా వారిని వీఐపీలుగా చూసి గౌరవ మర్యాద ఇచ్చినట్లయితే


 ఏలూరు  ,(ప్రజా అమరావతి);.


      దివ్యాంగులను చిన్న చూపు చూడకుండా వారిని వీఐపీలుగా చూసి గౌరవ మర్యాద  ఇచ్చినట్లయితే వారిలో ఆత్మస్థైర్యం పెరిగి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లా గలుగుతారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత అన్నారు.


    శుక్రవారం  అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా  గిరిజన భవన్  ఏలూరు లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  ఆమె మాట్లాడుతూ సమాజంలో అన్ని విధాలుగా మంచిగా , ఆరోగ్యంగా ఉండి, విద్యావంతులైన మహిళలు కూడా ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారని ఆమె అన్నారు. మహిళలు  ,దివ్యాంగులు సమాజంలో అభద్రతా భావం వివక్షతకు గురవుతున్నారని వారిని గౌరవించి వీఐపీలు గా ట్రీట్ చేయాలని ఆమె అన్నారు. దివ్యాంగులకు ఈ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆమె అన్నారు. వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి  దివ్యంగులకు లాప్ టాప్ లు ,సెల్ ఫోన్ లు ,మోట రైజ్డ్ ట్రై సైకిల్స్ , ట్రై సైకిల్ ఇవ్వడంతోపాటు వారికి అవసరమైన పరికరాలు , రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు.  దివ్యాంగులకు పెన్షన్ ఇవ్వడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతోందని ఆమె అన్నారు.  ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలు తీసుకొని దివ్యాంగులు అభివృద్ధి చెందాలని ఆమె అన్నారు.దివ్య0గులు సంతోషంగా , ఆనందంగా గడపాలని ఆమె కోరారు.  దివ్యాంగుల కు తల్లిదండ్రులు , కుటుంబ సభ్యులు , సమాజం వారిని వీఐపీలు గా ట్రీట్ చేయాలని ఆమె అన్నారు. దివ్యాంగుల కు ఏలూరులో రెస్ట్ తీసుకునేందుకు ఒక కమ్యూనిటీ హాలు నిర్మించడానికి కృషి చేయడం జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు.  2016 డిజేబుల్డ్ యాక్ట్ బలోపేతం చేయడానికి కృషి చేయడం జరుగుతుందని ఆమె అన్నారు.   అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు నిర్వహించిన  వివిధ అంశాల్లో ఆటల పోటీలలో విన్నర్ లు,  రన్నర్ లగా నిలిచిన 125 మందికి  హేలాపురి లైన్స్ క్లబ్ సహాయం తో సమకూర్చిన  బహుమతులు , సర్టిఫికెట్లు మంత్రి చేతుల మీదుగా ప్రధానం చేశారు. 


 ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) శ్రీమతి పద్మావతి , దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి ఝాన్సీ రాణి ,  డిజేబుల్ పీపుల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వి. యుగంధర్ , విజువల్ ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరభద్ర రావు ,  వికలాంగుల హక్కుల జాతీయ వేదిక  ఏలూరు  ప్రెసిడెంట్ కే. జయరాజు , వెస్ట్ గోదావరి అసోసియేషన్ ఆఫ్ డెప్  ,ఏలూరు నుండి టి. రాము,  వికలాంగుల మహా సంఘం ప్రెసిడెంట్ నండూరి రమేష్ తదితరులు  పాల్గొన్నారు. వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ దివ్యాంగులకు 2016 డిజేబుల్డ్ యాక్ట్ అమలయ్యేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దివ్యాంగులకు మూడువేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని అది సరిపోవడం లేదని 5000 వరకు పెంచాలని వారు కోరారు. ఏలూరులో దివ్యాంగుల కొరకు ఒక కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని వారు కోరారు. వివిధ సంఘాల నాయకులతో దివ్యాంగుల సమస్యలపై  రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరారు  .అనంతరం మంత్రి దివ్యాంగులకు పరికరాలు, ట్రై సైకిల్ అందజేశారు.

 

Comments