జంగారెడ్డిగూడెం (ప్రజా అమరావతి);
పోలవరం నిర్వాసితుల పునరావాస గ్రామాం లో పర్యటించిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి.
బుధవారం జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామం లో పోలవరం ప్రాజెక్ట్ బాధితుల కొరకు నిర్మించిన నిర్వాసితుల కొలని ని ఆయన పరిశీలించారు.
ఈ కాలనీలో నిర్వాసితులకు నిర్మించిన ఇల్లు ,మౌలిక వసతులు ఆయన పరిశీలించారు.ఈ గ్రామంలో 3905 గృహాలు ఉన్నాయి ఈ గృహాలకు రోడ్లు , డ్రైనేజీలు ,విద్యుత్ సౌకర్యం, మంచినీటి సదుపాయం ఇతర సౌకర్యాలను ఆయన పరిశీలించారు .
ఆయన వెంట పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ ఓ.ఆనంద్ ,గృహ నిర్మాణ శాఖ ఈ ఈ బి తారాచంద్ , డీఈ లు , ఏ ఈలు తదితరులు పాల్గొన్నారు .
addComments
Post a Comment