అమరావతి (ప్రజా అమరావతి):
రాష్ట్రంలో విద్యార్థులకు వృత్తి విద్యా శిక్షణ, పరిశోధన, అభివృద్ధితోపాటు నిరుద్యోగ యువతకు అప్రెంటిస్ షిప్ లలో సహకారం అందించడం కోసం జర్మనీకి చెందిన డ్యూయిష్ గెసెల్స్ చాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసమ్మెనార్బెయిట్ (జిఐజెడ్) సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో (ఎపిఎస్‌ఎస్‌డిసి) కలిసి పనిచేయనుంది. ఈ మేరకు వర్చువల్ విధానం ద్వారా ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు, జిఐజెడ్ ఐజివిటి ప్రాజెక్ట్ హెడ్ డాక్టర్ రోడ్నీ రెవియర్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు డ్యూయిష్ గెసెల్స్ చాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసమ్మెనార్బెయిట్ (జిఐజెడ్) కి చెందిన ఇండో-జర్మన్ ప్రోగ్రాం ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఐజివిఇటి), ఎపిఎస్ఎస్డిసి అవగాహనకు వచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు చెందిన సంస్థలను ఒకచోట చేర్చడం ఐజివిటి లక్ష్యం
. ఈ మేరకు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు స్థానికంగా సహకరించుకోవడానికి అవసరమైన సలహాలు, మార్గదర్శకాలను ఐజీవీటీ అందిస్తుంది
రాష్ట్రంలో ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో వృత్తి విద్యా శిక్షణ, పరిశోధన మరియు అభివృద్ధితోపాటు అప్రెంటిస్ షిప్ లలో సహకారం అందిస్తుంది. రాష్ట్రంలోని ప్రముఖ పరిశ్రమలు, సంస్థలు, త్వరలో ఏర్పాటు కానున్న నైపుణ్య కళాశాలల మధ్య సమన్వయం చేస్తూ వాటి మధ్య భాగస్వామ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా డిమాండ్ ఆధారిత, పనిప్రాంత ఆధారిత వృత్తి విద్య మరియు శిక్షణ (ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్) వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితోపాటు శిక్షణ ఫ్రేమ్ వర్క్ లను సిద్ధం చేయడంతోపాటు ఇండస్ట్రియల్ క్లస్టర్లలో శిక్షణా సామర్థ్యాలను పెంచడం, అధునాతన శిక్షణా పద్దతులను, సాధానాలను ఉపయోగించిన స్కిల్ కాలేజీల సహకారంతో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు, సీజీఎం కార్పొరేట్ కనెక్ట్ సత్యప్రభ, జిఐజెడ్ ప్రాజెక్ట్ హెడ్ డాక్టర్ రోడ్నీతోపాటు జిఐజెడ్ ప్రతినిధులు నరసింహం, చనీ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment