పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు (ప్రజా అమరావతి);
"క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని...
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు క్రైస్తవ సోదర, సోదరిమణులకు, వైస్సార్సీపీ కుటుంబ సభ్యులకు, అధికారులు, అనధికారులు, పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు,మీడియా కుటుంబ సభ్యులు,దైవ సేవకులు కుటుంబ సభ్యులు,ఏలూరు నియోజకవర్గంలో క్రైస్తవ కుటుంబ సభ్యులు అందరికి పేరు పేరునా క్రిస్మస్ శుభాకాంక్షలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు...
సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం కలిగి ఉండాలని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..
ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయి అని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు...
క్రిస్మస్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని...
లోక రక్షకుడు యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని, ఆయన చూపిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే మానవ జీవితాలు సుఖశాంతులతో ఉంటాయన్నారు..
రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని మంత్రి ఆళ్ల నాని ఆకాంక్షించారు..
కరోనా మహమ్మారి ఒమీక్రాన్ రూపంలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని మంత్రి ఆళ్ల నాని కోరారు..
addComments
Post a Comment