బాంబో మొక్కలు సాగు ను పరిశీలించిన ఎంవీఎస్ నాగిరెడ్డి

 కొల్లిపర (ప్రజా అమరావతి); కొల్లిపర లోని పిడపర్రు లాకులు వద్ద కృష్ణా నది ఒడ్డున కర కట్ట దిగువున వేసిన భీమా బాంబో మొక్కలను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మిషన్ వైస్ చైర్మన్ mvs నాగిరెడ్డి  సోమవారం పరిశీలించారు. ఈ పరిశీలనలో రైతులు తెలిపిన వివరాలు మూడు నెలల క్రితం కర్ణాటక మైసూర్ నుంచి తీసుకువచ్చిన బీమా బాంబో మొక్కలను ఐదు ఎకరాల పొలం లో ఎకరానికి నాలుగు వందల యాభై మొక్కలు చొప్పున నాట మని రైతులు తెలిపారు. రైతులు గుదిబండి. వెంకట నాగిరెడ్డి, గుదిబండి. శ్రీనివాస్ రెడ్డి,  జొన్నల. శ్రీనివాస్ రెడ్డి, జొన్నల. సాంబి రెడ్డి వివరాలు తెలిపారు.    నాలుగేళ్లలో కటింగ్ కు వస్తుందని తెలిపారు.  డ్రిప్ సౌకర్యం కలదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మిషన్ మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి,  ఆచార్య ఎన్.జి.రంగా యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ సీడ్స్ సుబ్బరామిరెడ్డి,  శ్రీధర్ రెడ్డి, రైతులు ఉయ్యూరు. సాంబీ రెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.



Comments