అసాంఘిక కార్యకలాపాలు గా మారిన డంపింగ్ యార్డులు

 కొల్లిపర (ప్రజా అమరావతి);


      కొల్లిపర మండలం, తూములూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్వచ్చ సంకల్ప పథకం ద్వారా , చెత్త సేకరణ డంప్ యార్డ్లులలో    తడి చెత్తను, పొడి చెత్తను సేకరించి దానినీ నిలవ చేయటం ద్వార వచ్చే  ఎరువును రైతులకు అందించాలని సదుద్దేశం తో   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి     వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రవేశ పెట్టిన ఈ పథకం . గ్రామాలలో  పూర్తీ స్థాయిలో  జరగడంలేదని అధికారుల నిర్వహణ లోపం ప్రధాన కారణమని  గ్రామస్థుల  వాపోతున్నారు . చెత్త నిల్వ చేయాల్సిన డంప్ యార్డ్ లు ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. అందుకు  నిదర్శనంగా అక్కడ లభించిన ఆధారాలు ప్రధాన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. దీనిపై సంభందిత అధికారుల  తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్థుల విజ్ఞప్తి చేస్తున్నారు.