తిరుమల శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఘనంగా అభిషేకం
తిరుమల, డిసెంబర్ 12 (ప్రజా అమరావతి): తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి కార్తీక మాసం చివరి ఆదివారం సందర్బంగా ప్రత్యేక అభిషేకం ఘనంగా నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం చివరి ఆదివారం స్వామివారికి తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, గంధంతో తిరుమంజనం నిర్వహించి, సింధూరంతో విశేష అలంకరణ చేశారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment