కాకాణి చేతుల మీదుగా యానాదుల కుటుంబాలకు ఆధార్ కార్డుల పంపిణీ

 *"కాకాణి చేతుల మీదుగా యానాదుల కుటుంబాలకు ఆధార్ కార్డుల పంపిణీ


"శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లిగూడూరు, ముత్తుకూరు మండలాల్లో పర్యటించి, యానాది కుటుంబాలకు ఆధార్ కార్డు అందించేందుకు మొబైల్ ఆధార్ కార్డు కేంద్రాలను ప్రారంభించి, ఆధార్ కార్డులను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


తోటపల్లిగూడూరు మండలం, కోడూరు పంచాయతీలో మొబైల్ ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.


ముత్తుకూరు మండల కేంద్రంలో యానాది కుటుంబాలకు ఆధార్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి


యానాదులకు ఆధార్ కార్డులు అందించేందుకు విశేషంగా కృషి చేసిన పంచాయతీ కార్యదర్శులను, గ్రామ సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను అభినందించిన ఎమ్మెల్యే కాకాణి.


ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న నారుమళ్లకు చెందిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాల పంపిణీ.
 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, వాటిని సమగ్రంగా, సంపూర్ణంగా అన్ని వర్గాలకు అందించడమే ధ్యేయంగా పని చేస్తున్నారు.


 అమాయకులైన యానాది కుటుంబాలు ఆధార్ కార్డులు లేక, సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందలేకపోవడం నన్ను కలిచివేసింది.


 యానాదులకు మొబైల్ ఆధార్ కేంద్రం ఏర్పాటుచేసి, అందరికి ఆధార్ కార్డులు అందించేందుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారు చొరవ తీసుకోవడం అభినందనీయం.


 ఆధార్ కార్డులు అందుకున్న యానాది కుటుంబాలందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఆర్ధిక లబ్ధి కలుగుతుంది.


 తెలుగుదేశం ప్రభుత్వంలో నిరుపేదలు, యానాదుల కుటుంబాలను విస్మరించి, ధనవంతులకు కొమ్ము కాశారు.


 చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలు కొందరికే వర్తింపజేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందజేస్తున్నారు.


 నిరుపేదలైన యానాది కుటుంబాలకు నూటికి నూరుశాతం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి, ఆర్థికంగా అండగా నిలుస్తాం.


 యానాదులపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఆధార్ కార్డులు అందజేసిన జిల్లా అధికారులకు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, తహశీల్దార్లకు, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, స్థానిక నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.