ప్రతి ఇంటిలోనూ ఘనంగా సి.ఎం. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాద్యక్షులు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి
అమరావతి,డిశంబరు 21 (ప్రజా అమరావతి): రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి 49 వ జన్మదిన వేడుకలను ప్రతి ఇంటిలోనూ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాద్యక్షులు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి 49 వ జన్మదినాన్ని పురస్కరించుకొని అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లోని ఆయన ఛాంబరులో ఔట్ సోర్సింగ్ మహిళా సిబ్బందితో కేకు కట్ చేయించి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికై పలు వినూత్న పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత మరియు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆ మహానేత ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమానికై మరెన్నో వినూత్న పథకాలను అమలు చేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఆయన తనయుడు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నారని కొనియాడారు. తండ్రి ఆశయమైన మహిళా సాధికారతకు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత నిస్తున్నారన్నారు. అదే ఆశయాన్ని కొనసాగిస్తూ స్వర్గీయ శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జన్మదినం రైతుదినోత్సవం రోజు మరియు ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జన్మదినం రోజు తమ ఛాంబరులో ఔట్ సోర్సింగ్ మహిళా సిబ్బంది చేదులు మీదుగా కేకులు కట్ చేయించడం జరుగుచున్నదని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని అర్థరాత్రి నుండే దేశ,విదేశాల నుండి పలువురు పెద్దఎత్తున పలు మాథ్యమాలు జామ్ అయ్యే విధంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారన్నారు. శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని స్వర్గీయ శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరియు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కుటుంబ అభిమానులు అందరికీ ఆయన ధన్యవాదములు తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ మిషన్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
addComments
Post a Comment