దేవులపల్లి అమర్ కు అమెరికా తెలుగు సంఘం "ఆటా" ఎక్సలెన్స్ అవార్డ్


హైదరాబాద్ డిసెంబర్ 26 (ప్రజా అమరావతి):

దేవులపల్లి అమర్ కు అమెరికా తెలుగు సంఘం "ఆటా" ఎక్సలెన్స్ అవార్డ్ :


జర్నలిజం రంగంలో విశేష కృషి చేసినందుకు అమెరికా తెలుగు సంఘం దేవులపల్లి అమర్‌ను ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది.

ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా & అంతర్రాష్ట్ర వ్యవహారాల (NMISA) సలహాదారుగా పనిచేస్తున్నారు,  అమెరికా తెలుగు సంఘం (ఆటా) వారి వేడుకలు - సేవా డేస్ గ్రాండ్ ఫినాలే ముగింపు కార్యక్రమం  ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించింది.

అమెరికా తెలుగు సంఘం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో 1990 సంవత్సరంలో స్థాపించబడిన లాభాపేక్ష లేని జాతీయ స్థాయి సంస్థ. తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహిస్తూ, ప్రవాస భారతీయుల ప్రయోజనం కోసం ఈ వేదిక ద్వారా అనేక సేవలందిస్తున్నారు. 

ఈ సందర్భంగా ' ఆటా ' నిర్వాహకులకు శ్రీ అమర్ కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర సాంస్కతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, ఎంఎల్ఏ శ్రీ రసమయి బాలకిషన్,. పద్మశ్రీ డాక్టర్ శోభరాజు, తదితరులు పాల్గొన్నారు.

Comments