ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడినా సరైన నాయకత్వం ఉన్న చోట టీడీపీకి మంచి ఫలితాలొచ్చాయి

 అమరావతి (ప్రకాశం జిల్లా/దర్శి) (ప్రజా అమరావతి);


_*దర్శి నగర పంచాయితీ ఎన్నికల ఫలితాలపై ప్రకాశం జిల్లా నాయకులతో సమీక్షలో టీడీపీ అధినేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు*_


*ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడినా సరైన నాయకత్వం ఉన్న చోట టీడీపీకి మంచి ఫలితాలొచ్చాయి*ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత, జిల్లా నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో దర్శిలో విజయం  సాధించారు.


వైసీపీ నేతలు రెండున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలను మానసికంగా, శారీరకంగా వేధించారు


టీడీపీ అధికారంలోకి వచ్చ్చాక మిమ్మల్ని ‎ ఇబ్బంది పెట్టిన వారికి  వడ్డీతో సహా చెల్లిస్తాం


నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్ర అభివృద్దిపై   దృష్టి పెట్టి  పార్టీని నిర్లక్ష్యం చేశాం.


ఇప్పడు పార్టీని పునాదుల నుంచి సరైన నాయకత్వంతో బలోపేతం చేస్తున్నాం


30 ఏళ్ల వరకు స్తిరంగా ఉంటే నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తాం, పార్టీలో కష్టపడి నిజాయితీగా పనిచేసినవారికే ప్రాధాన్యం


పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్క కార్యకర్తకు, నాయకునికి అన్యాయం జరవనివ్వం. 


ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్ధలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో నూకసాని బాలాజీ, దామచర్ల జనార్ధన్, ముత్తుముల అశోక్ రెడ్డి, నారపుశెట్టి పాపారావు, పమిడి రమేష్ , గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గూడూరి ఎరిక్షన్ బాబు, బ్రహ్మం, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.