నెల్లూరు (ప్రజా అమరావతి);
ఇటీవల భారీ వర్షాలు, వరదలు కారణంగా దెబ్బతిన్న కోవూరు , పాటూరు రోడ్డు ను, కోవూరు చెరువు ను జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, గురువారం సాయంత్రం సందర్శించి, తాత్కాలికంగా చేపట్టిన పనులను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ కోవూరు చెరువుకు గండి పడటంతో దెబ్బతిన్న కోవూరు - పాటూరు రోడ్డు ను పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్డుకు చేపట్టిన తాత్కాలిక మరమ్మతులను పరిశీలించి, శాశ్వత ప్రాతిపదికన రోడ్డును పునరుద్ధరించేందుకు కు చర్యలు తీసుకోవాలని, అందుకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అనంతరం కోవూరు చెరువుకు గండి పడిన ప్రదేశాన్ని సందర్శించి, చేపట్టిన తాత్కాలిక పనులను పరిశీలించి, శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని
కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అనంతరం జాతీయ రహదారి నుండి ఇనమడుగు కు వెళ్ళే రహదారి లో దెబ్బతిన్న రోడ్డుకు చేపట్టిన తాత్కాలిక పునరుద్ధరణ పనులను పరిశీలించారు.
కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ శ్రీ నిరంజన్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్. ఈ శ్రీ సుబ్రహ్మణ్యం, కోవూరు ఎం. పి.డి.ఒ శ్రీ శ్రీహరి, ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment