పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కే వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.



నెల్లూరు,డిసెంబర్20 (ప్రజా అమరావతి):--


పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కే వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.  


సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో  స్పందన కార్యక్రమం నిర్వహించి  జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు.

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అర్జీల  పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో గడువు దాటిన అర్జీలు 88 ఉన్నాయని వాటన్నిటిని వచ్చే వారం లోగా పరిష్కరించాలని ఆదేశించారు పరిష్కరించిన అర్జీలు నాణ్యత గా ఉండాలని మరల అదే అంశంపై అర్జీలు రాకుండా అర్జీదారునికి అర్థమయ్యేలా తెలియ చెప్పాలన్నారు.


జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ బహుమతులను అందజేసి వారిని అభినందించారు. 

జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ

-------

జిల్లాలో పరిశ్రమలు విరివిగా నెలకొల్పుటకు అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కే వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని వివిధ పరిశ్రమలు దరఖాస్తు చేసుకున్న 73 క్లేయిములను " జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ "  సమావేశంలో  జిల్లా కలెక్టర్  ఆమోదించి వారికి  2.57 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీలు, ఎస్. జీ. ఎస్టీ. రీయింబర్స్మెంట్,  వడ్డీ రాయితీలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హలో పెద్ద మెగా ప్రాజెక్టులు జిల్లాలో 19694 కోట్ల రూపాయల పెట్టుబడి తో 20 పెద్ద మెగా ప్రాజెక్టు యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయని వాటి ద్వారా 16115 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే 262 కోట్ల రూపాయల పెట్టుబడి వ్యయంతో 117 యూనిట్లు ఎం ఎస్ ఎం ఈ యూనిట్లు నెలకొల్పడం జరుగుతుందని వాటి ద్వారా 3974 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ఈ యూనిట్లు త్వరితగతిన నెలకొల్పేందుకు తగినచర్యలు చేపట్టాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ కింద వచ్చిన 578 దరఖాస్తుల్లో 539 దరఖాస్తులను ఆమోదించామని,  11 దరఖాస్తులను తిరస్కరించామని, 28 దరఖాస్తులు పెండింగ్లో  ఉన్నాయన్నారు.అందులోకాలుష్య నియంత్రణ మండలి,  అగ్నిమాపక సేవలు, లీగల్ మెట్రాలజీ, కర్మాగారాల శాఖ, భూగర్భ జల శాఖ పరిధిలో పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని త్వరగా  పరిష్కరించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

    ఈ కార్యక్రమంలో  రెవెన్యూ, అభివృద్ధి, గృహనిర్మాణం సంయుక్త కలెక్టర్ లు శ్రీ హరెందిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీ విదేహ్ ఖరే, మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, ఆసరా సంయుక్త కలెక్టర్ శ్రీమతి  రోజ్ మాండ్, డి ఆర్ ఓ శ్రీ చిన్న ఓబులేసు, జడ్పీ సీఈఓ శ్రీ శ్రీనివాస రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీ కే దాసు, డి పి ఓ శ్రీమతి ధనలక్ష్మి ,డి ఆర్ డి ఎ డ్వామా,  హౌసింగ్ పిడి లు శ్రీ సాంబశివ రెడ్డి, శ్రీ తిరుపతయ్య,  శ్రీ వేణుగోపాల్,  డి.ఎస్.ఒ శ్రీ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్ ఈ శ్రీ సుబ్రహ్మణ్యం,  జలవనరుల శాఖ ఎస్ ఈ శ్రీ కృష్ణ మోహన్, నుడా వి సి శ్రీ రమేష్ ,సర్వే భూరికార్డుల ఏడి శ్రీ హనుమాన్ ప్రసాద్, వ్యవసాయ శాఖ జెడి శ్రీమతి ఆనంద కుమారి విద్యుత్ శాఖ ఎస్ ఈ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మారుతీ ప్రసాద్ వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

Comments