జవాద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అప్పల రాజు

 


 జవాద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అప్పల రాజుశ్రీకాకుళం, డిసెంబరు 4 (ప్రజా అమరావతి): జవాద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పల రాజు పర్యటించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రభావిత ప్రాంతాలలో శని వారం మంత్రి అప్పల రాజు పరిశీలించారు.పలాస మున్సిపాలిటీ ప్రధాన రహదారిపై పేరుకు పోయిన చెత్తను తొలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది సహాయంతో పూడికలు తొలిగించి, జేసిబి లతో డ్రైనేజీ అడ్డంకులు తొలిగించడం జరిగింది. అనంతరం పలాస మండలం బ్రహ్మణతర్ల, అమలకుడియా ప్రాంతాల్లో  పర్యటించి తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటపోలాలను పరిశిలించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రజలు ఎవరూ తుఫాన్ తీవ్రత తగ్గేవరకు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేసారు.

Comments