ప్రతి నెలా సిసిల్ రైట్స్ డే జరపాలి – చల్లం ఆనంద్ ప్రకాష్

 

                           ప్రతి  నెలా  సిసిల్ రైట్స్ డే  జరపాలి – చల్లం ఆనంద్ ప్రకాష్ 

తిరుపతి, డిసెంబర్ 06 (ప్రజా అమరావతి):    ప్రతి నెలా సివిల్ రైట్స్ డే తప్పకుండా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎస్.సి. కమీషన్ మెంబర్ శ్రీ చల్లం ఆనంద్ ప్రకాష్ సూచించారు.  సోమవారం  సాయంత్రం స్థానిక శ్రీ పద్మావతి అతిధి గృహంలో  సివిల్ రైట్స్ డే  పై తిరుపతి ఆర్. డి. ఓ కనక నరసా రెడ్డి, తహసిల్దార్లు తిరుపతి అర్బన్  వెంకట రమణ,రూరల్  లోకేశ్వరి, పోలీస్ అధికారులతో సమీక్ష  నిర్వహించారు.  

        అనంతరం  కమీషన్ మెంబర్  శ్రీచల్లం ఆనంద్ ప్రకాష్ మీడియాకు వివరిస్తూ ప్రతి నెలా ఎస్ సి, ఎస్ టి  కాలనీల్లో    సివిల్ రైట్స్ డే జరపాలని  సూచించారు.  సంబంధిత అధికారులు, పోలీసులు, రెవెన్యూ శాఖ  సమన్వయముతో  పకడ్బందీగా  నిర్వహించి, హక్కులను వివరించాలని తెలిపారు.  అలాగే నిర్వహించిన  సమావేశాలకు సంబంధించిన మినిట్స్ కమీషన్ కార్యాలయానికి  ప్రతి నెలా అందేలా చూడాలని తెలిపారు.  మార్పు కోసం చేపడుతున్న  ఈ కార్యక్రమాలు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపై వుందని వివరించారు. గౌ.ముఖ్యమంత్రి కమిషన్ రాష్ట్రంలో పర్యటించాలని పలు సూచనలు చేసారని, హక్కులతో పాటు సంక్షేమపతకాలు  కూడా  అందేలా చూడాలని అధికారులను  కోరినట్లు తెలిపారు. 

అర్దిఒ కనకనరసా రెడ్డి  మాట్లాడుతూ ఆజాదికా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న తరుణంలో సంక్షేమ పథకాల అమలులో మరింత సహకారం అందించి మారుమూల ప్రాంతాల్లో వున్న  ఎస్.సి.,ఎస్.టి ల సామాజిక చైత్యన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా అధికారులపై వుందని అన్నారు. ఎస్.సి.కమిషన్ మెంబర్ చల్లం ఆనంద్ ప్రకాష్ గారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తన అనుభవాలను, కమిషన్ సూచనలు చేసింది ఆమేరకు ఇప్పటి నుండే సంక్షేమం , అవగాహన పై దృష్టి పెట్టి తిరుపతి రెవెన్యు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులతో, పోలీస్ సమన్వయంతో, రెవెన్యూ శాఖ పగద్భందీగా నిర్వహిస్తుందని అన్నారు. ఇప్పటికే జరిపిన సివిల్ రైట్స్ డే వివరాలను మెంబర్ కు వివరించిన తహసిల్దారు. 



Comments