తిరుపతి, చిత్తూరు జిల్లా (ప్రజా అమరావతి);
*చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం శ్రీ వైయస్ జగన్ పర్యటన*
*తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గాల్లో పర్యటించిన సీఎం ముఖ్యమంత్రి*
*తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని శ్రీకృష్ణానగర్, సరస్వతీనగర్ ప్రాంతాల్లో నేరుగా వరద బాధితులతో మాట్లాడిన సీఎం*
*ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. వరద ప్రభావాన్ని తెలుసుకుంటూ, ప్రభుత్వ సాయంపైనా ఆరా తీస్తూ సాగిన సీఎం పర్యటన*
*నేరుగా సీఎంకే తమ సమస్యలను విన్నవించుకున్న బాధితులు
*
*వాటి పరిష్కారం కోసం అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి*
*ఉపాధి కల్పించాలని సీఎం శ్రీవైయస్ జగన్ కోరిన వరద బాధిత కుటుంబాలకు చెందిన యువతీ, యవకులు*
*వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన సీఎం*
*ముత్యాలరెడ్డి పల్లి పరిధిలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి*
*సరస్వతీనగర్‌లో ఉద్యోగుల తరపున సీఎంను కలిసి పీఆర్‌సీ పై విజ్ఞప్తి*
*పీఆర్‌సీ ప్రక్రియ పూర్తయిందన్న సీఎం*
*10 రోజుల్లో పీఆర్‌సీపై ప్రకటన చేస్తామన్న సీఎం శ్రీ వైయస్.జగన్*
*అన్నా రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాను... నిన్ను చూడాలనుందన్నా అంటూ కుమార్తెతో కబురు పంపిన సరస్వతీనగర్‌కు చెందిన విజయకుమారి*
*వరద పర్యటలో ఉన్న శ్రీ వైయస్.జగన్‌కు తన తల్లి కోరికను తెలిపిన విజయకుమారి కుమార్తె వైష్టవి*
*ప్రమాదంలో గాయపడి ఇంకా కోలుకోని ఆర్ విజయకుమారిని స్వయంగా ఇంట్లోకి వెళ్లి పరామర్శించిన సీఎం*
*ఆమెకు ప్రమాదం జరిగిన తీరును, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం*
*త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం శ్రీ వైయస్.జగన్*
*నేరుగా తమ ఇంటిలోనికి వచ్చి పరామర్శించడంపై హర్షం వ్యక్తం చేసిన విజయకుమారి, ఆమె భర్త గజేంద్ర, కుమార్తె వైష్ణవి*
*అనంతరం తిరుచానూరు– పాడీపేట వద్ద స్వర్ణముఖి నదిపై వరద ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించిన సీఎం శ్రీ వైయస్.జగన్*
*ప్రాణాలకు తెగించి వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసు కానిస్టేబుల్ ప్రసాదుతో సహా మరో ముగ్గురుని అభినందించి, సత్కరించిన సీఎం*
*తిరుపతి*
చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు, అనంతరం వరదల కారణంగా నీట మునిగిన పలు కాలనీల్లో సీఎం శ్రీ వైయస్.జగన్ పర్యటించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా పద్మావతి అతిధి గృహం నుంచి బయలుదేరిన సీఎం నేరుగా ముత్యాలరెడ్డిపల్లి, శ్రీకృష్ణానగర్, సరస్వతీనగర్, గాయత్రీనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. నేరుగా బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా...
వరదల్లో అధికారులు సహాయ పునరావాస కార్యక్రమాలు సరిగ్గా చేశారా ? ప్రభుత్వం అందించిన సాయం అందిందా ? నిత్యావసరాలు అందాయా ? అంటూ సీఎం ముంపునకు గురైన కాలనీ వాసులను అడిగారు. ప్రభుత్వం సకాలంలో స్పందించిందని, మీ మేలు మరువలేమని మహిళలు బదులిచ్చారు.
తిరుపతి కార్పొరేషన్‌కు చెందిన కార్పొరేటర్లు రాజమ్మ సీఎంతో మాట్లాడుతూ... వరదల్లో వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు చాలా బాగా సేవ చేశారని చెప్పారు. వరద తగ్గిన తర్వాత కూడా నిత్యావసరాలు, రూ.2వేలు ఆర్ధిక సాయం చేసారని తెలిపారు.
అనంతరం వరద నష్టం పై అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించారు. వరద ప్రభావం, సహాయ పునరావాసంపై అధికారులు సీఎంకు వివరాలందించారు.
చిత్తూరుకు చెందిన మస్తాన్, జమీనా దంపతులు కేన్సర్ ట్రీట్‌మెంట్ గురించి సీఎంను కలిసి తమ బాధను చెప్పుకున్నారు. వెంటనే వారికి అవసరమైన సాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
స్ధానిక సమస్యలను ప్రస్తావిస్తూ... జగదీశ్వరి, బేబీ ఇతర మహిళలు నీటి సమస్య గురించి చెప్పగా... వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. జయశ్రీ అనే మహిళ కేన్సర్ చికిత్స కోసం సీఎంను కలవగా... సీఏంసీలో చికిత్సకు కావాల్సిన సాయం చేస్తామన్నారు.
డి పట్టాలో ఇంటి రిజిస్ట్రేషన్ గురించి మరికొంతమంది సీఎంకు విన్నవించగా.... జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో దరఖాస్తు చేసుకుని ఓటీఎస్ కింద రెగ్యులరైజ్ చేసుకోవాలన్నారు.
శ్రీకృష్ణానగర్ ప్రాంతం ముంపునకు గురికాకుండా ఉండేందుకు పేరూరు నీటిని రాకుండా చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ప్రొఫెసర్ రమణారెడ్డి సీఎంకు విజ్ఞప్తి చేయగా... భవిష్యత్తులో ఈ తరహా ముంపు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
సరస్వతీనగర్‌లో వరద పరిహారం గురించి మహిళలను ఆరా తీయగా... అధికారులు సకాలంలో వచ్చి, అన్ని రకాల సాయం చేసారని, రూ.2వేల నగదుతో పాటు నిత్యావసరాలు ఇచ్చారని మస్తానీ అనే మహిళ సంతోషం వ్యక్తం చేసింది. కోమలి అనే మరో మహిళ మాట్లాడుతూ... మీరు దగ్గరుండి చెప్పినట్లే అధికారులు అన్నీ అందించారని, మీరున్నారనే ధీమాతోనే నాలాంటి ఒంటరి మహిళలు సైతం ధైర్యంగా బతుకుతున్నారని తెలిపింది. అదే కాలనీకి చెందిన మల్లికా బేగమ్‌కు తాను క్యాన్సర్ పేషెంట్‌నని సీఎంకు విన్నవించుకోగా... చికిత్స కోసం సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
*అన్నా ప్రమాదంలో గాయపడ్డాను... నిన్ను చూడాలని ఉంది.*
అన్నా రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాను .. నిన్ను చూడాలనుందన్నా అంటూ సరస్వతీనగర్‌కు చెందిన ఆర్ విజయకుమారి అనే మహిళ తన కుమార్తె ద్వారా సీఎం శ్రీ వైయస్.జగన్‌కు విన్నవించుకుంది.
వరద ప్రాంతాల పర్యటలో ఉన్న శ్రీ వైయస్.జగన్‌కు తన తల్లి కోరికను కుమార్తె వైష్టవి సీఎంకు తెలియజేసింది. దీంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంకా కోలుకోని ఆర్ విజయకుమారిని స్వయంగా ఇంట్లోకి వెళ్లి పరామర్శించిన సీఎం
ఆమెకు ప్రమాదం జరిగిన తీరును, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నేరుగా తమ ఇంటిలోనికి వచ్చి పరామర్శించడంపై విజయకుమారి, ఆమె భర్త గజేంద్ర, కుమార్తె వైష్ణవి హర్షం వ్యక్తం చేశారు.
తన కేన్సర్ చికిత్స కోసం ఆదుకోవాలంటూ వచ్చిన మల్లికా బేగమ్ అనే మహిళకు చికిత్స కోసం అవసరమైన సాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.
*పీఆర్‌సీ పూర్తయింది, పదిరోజుల్లో అనౌన్స్ చేస్తా సీఎం*
వరద బాధిత ప్రజలను సీఎం శ్రీ వైయస్.జగన్ నేరుగా పరామర్శిస్తున్న సమయంలో ఉద్యోగులు తరుపున వచ్చిన కొంతమంది పీఆర్సీపై సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే జోక్యం చేసుకున్న సీఎం.. పీఆర్‌సీ ప్రక్రియ పూర్తయిందన్నారు. పది రోజుల్లో పీఆర్‌సీపై అనౌన్స్ చేస్తామని చెప్పారు.
*తిరుచానూరు– పాడిపేట వద్ద స్వర్ణముఖి నదిపై కూలిన బ్రిడ్జి పరిశీలన*
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, పాడిపేట వద్ద భారీ వరదల ధాటికి స్వర్ణముఖీ నదిపై కూలిన బ్రిడ్జిని సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో రహదారులు, భవనాలు, వ్యవసాయ, ఉద్యానవన, గృహనిర్మాణం, విద్యుత్ శాఖలకు సంబంధించి వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అనంతరం స్దానికులతో వరద సహాయ చర్యలపై సీఎం మాట్లాడారు.
*మీ వల్లే బ్రతికున్నాం..*
ఈ సందర్భంగా తిరుచానూరుకు చెందిన జి విజయలక్ష్మి మాట్లాడుతూ... వరదల్లో మీరు వెంటనే అప్రమత్తమై సాయం చేయకపోతే మేం ప్రాణాలతో ఉండేవాళ్లం కాదంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేసింది. వరద సహాయక చర్యల్లో అధికారులు చక్కగా పనిచేశారని తెలిపింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి రేషన్, రూ.2వేలు డబ్బులూ అందాయా ? అని సీఎం ప్రశ్నించిగా...
అన్నిరకాలుగా తమకు సాయం అందిందని వెంకటరెడ్డి, చెంగారెడ్డి చెప్పారు.
*వరద రెస్క్యూ ఆపరేషన్ చేసిన వారికి సత్కారం*
నవంబరు 18, 2021 రాత్రి భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదీ వరదల్లో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారిని సీఎం అభినందించారు. ప్రాణాలకు తెగించి వరద సహాయక చర్యల్లో పాల్గొని స్ధానికులను రక్షించిన తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్ ప్రసాదును, రామకృష్ణ కాలనీకి చెందిన ఎస్ శ్రీనివాసులరెడ్డి, మధు, రెడ్డప్పలను అభినందించిన సీఎం వారిని సత్కరించారు.
అనంతరం చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకున్న సీఎం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి నెల్లూరు పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి(ఎక్సైజ్ శాఖ) కె నారాయణస్వామి, జిల్లా ఇంఛార్జి మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట, తిరుపతి ఎంపీలు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, డాక్టర్ పి గురుమూర్తి, చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో పాటు పలువులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment