పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పురోగతి,

 


పోలవరం  (ప్రజా అమరావతి);


పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పురోగతి,


భారత ప్రభుత్వం నుంచి రావలసిన నిధులకు సంబంధించిన వివరాలను జలవనరుల శాఖ అధికారులు అందించారని, వాటిపై పూర్తి స్థాయిలో సమీక్షించడం జరిగిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంయుక్త కమిషనర్ అనుపమ్ కుమార్ శ్రీవత్సపేర్కొన్నారు.


బుధవారం ఇరిగేషన్, మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధుల తో ప్రాజెక్ట్ నిర్మాణం ప్రగతి పై ప్రాజెక్ట్ సమావేశం మందిరంలో సమీక్షించి, అనంతరం స్పిల్ వే, టానెల్స్, కాపర్ డ్యామ్, పి. రెగ్యులేటర్ సిస్టం,  పట్టిసీమ  డెలివరీ, లిఫ్టింగ్ పాయింట్స్ తదితర ప్రాంతాల్లో సాంకేతిక బృందం లోని ఉన్నతాధికారి గోయల్ తో కలిసి పర్యటించారు.


ఈ సందర్భంగా శ్రీవత్సవ్  భారత ప్రభుత్వం నుంచి ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి న పెండింగ్ బిల్లు ల వివరాలు తెలుసుకుంటూ, , పనుల పురోగతి పై సానుకూలంగా స్పందించారు. భారత ప్రభుత్వం ద్వారా రావలసిన(రీయింబర్సుమెంట్) నిధులు విడుదల కు , అదేవిధంగా త్రాగునీటి కి సంబంధించిన ప్రతిపాదనలు పై అధికారులతో చర్చించడం జరిగింది. నిధుల విడుదలకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని బకాయి లపై అధికారులు ఇచ్చిన వివరణ పై కూడా ఆయన సానుకూలత వ్యక్తం చేశారు.


ఈ సమావేశంలో  చీఫ్ ఇంజినీర్ బి. సుధాకర్, ఎస్ఈ  కె.నరసింహ మూర్తి, జలవనరుల సలహాదారు  గిరిధర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఆదిరెడ్డి, బాలకృష్ణమూర్తి, డీఈఈలు లక్ష్మణ్‌, నాయుడు, శ్రీనివాస్‌, మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎంఈఐఎల్‌)  ప్రతి నిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.




Comments