భారతరత్న మన మధ్య లేకున్నాఆయన ఆశయాలు సజీవంగా ఉండాలి – చల్లం ఆనంద్ ప్రకాష్భారతరత్న మన మధ్య లేకున్నాఆయన ఆశయాలు సజీవంగా ఉండాలి – చల్లం ఆనంద్ ప్రకాష్


తిరుపతి, డిసెంబర్ 06 (ప్రజా అమరావతి): డా.బి.ఆర్. అంబేద్కర్ దేశంకోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుబావుడు,  భారతరత్న ఇప్పుడు మన మధ్య లేకున్నా ఆశయాలు సజీవంగా ఉండాలంటే మనం ఎల్లపుడు బి.ఆర్.అంబేద్కర్ అమర్ రహే అని గుర్తిమ్చుకోవాలని  రాష్ట్ర ఎస్.సి.కమీషన్ సభ్యులు శ్రీచల్లం ఆనంద్ ప్రకాష్ అన్నారు. 


సోమవారం ఉదయం ఎస్.వి.యూనివర్సిటీ ముఖ ద్వారం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి, నివాళులు అర్పించి సెనేట్ హాల్ నందు 65 వ వర్ధంతి కార్యక్రమంలో అతిధులుగా రాష్ట్ర   ఎస్.సి.కమీషన్ మెంబర్, ప్రభుత్వ విప్ మరియు కోడూరు ఎం.ఎల్.ఎ కె.శ్రీనివాసులు, ఎస్.వి.యు.వి.సి.రాజా రెడ్డి, రెక్టార్ శ్రీకాంత్ రెడ్డి, రిజిస్ట్రార్ చంద్రయ్య, ప్రముఖులు , అద్యాపకులు , విద్యార్థులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.  


ఎస్.సి. కమీషన్ సభ్యులు  మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో విజ్ఞానాన్ని అందించిన గొప్ప వ్యక్తిగా కీర్తింపబడి కొలంబియా యూనివర్సిటీ ఇంగ్లాండ్ నందు భారతరత్న విగ్రహాన్ని ప్రతిష్టించారని, భారతీయులే కాక విదేశీయులు ఆయనకు కృతఙ్ఞతలు అందిస్తున్నారని గుర్తుచేశారు. దాదాపు 60 దేశాల  రాజ్యాంగాలు చదివి ప్రపంచంలో అతి పెద్ద దేశమైన భారతదేశానికి ఆలోచన చేసి రాజ్యాంగాన్ని అందించారని అన్నారు. గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తులు ఇందిరా గాంధి, మోడీ లాంటి వారు కూడా భారత రాజ్యాంగం కారణంగానే సాధారణ వ్యక్తులైన మేము నేడు భారత ప్రధానమంత్రి పదవుల్లో ఉన్నామని పలు మార్లు అన్నారని గుర్తుచేశారు. ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యతను ఇచ్చి అమలు చేస్తే అసమానతలు తొలగుతాయని ఆనాడే బారరత్న  తెలిపారని అన్నారు. కుల వ్యవస్థ పరంగా కాకుండా మేధావిగా అందరు గుర్తించి ఆయన ఆశయాలను అనుసరించాలని అన్నారు. అదే స్పూర్తితో నేడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విద్యకు ప్రాధాన్యతను ఇచ్చి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన , నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం వంటివి అమలు చేస్తున్నారని తెలిపారు. గౌ.ముఖ్యమంత్రి రాష్టంలోని అన్ని జిల్లాలో పర్యటించి ఎస్.సిల  సమస్యలు పరిష్కరించాలని సూచిచారని తెలిపారు.  


ప్రభుత్వ విప్ మరియు కోడూరు శాసనసభ్యులు మాట్లాడుతూ భారతరత్న మరణం ప్రపంచ చరిత్రలో చీకటి రోజని, సమానత్వం కోసం పోరాడిన మహానుబావుడు డా.బి.ఆర్.అంబేద్కర్ అని అన్నారు. భారతరత్న ఒక వ్యక్తి కాదని భారతీయ సంపద అని అన్నారు. బడుగులుగా చదువు కున్నందుకు రాజ్యాంగం వల్లే  నేడు నాలాంటి వారు పదవులు అందుకోగాలుగుతున్నామని అన్నారు.  భారతరత్న ఆశయం మేరకు మన ముఖ్యమంత్రి నిరంతరం పాటు పడుతూ పేదలకు కావలసిన కూడు, నీడ అనే పేదలందరికీ ఇళ్ళు మంజూరు చేశారని అన్నారు. 

నాడు-నేడు పాఠశాలల్లో  సౌకర్యాల కల్పనతో 16 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుండి ప్రభుత్వ బడులకు వచ్చారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 70 శాతం మంది విద్యార్థులు పెదలేనని వారికోసం పోటీ ప్రపంచంలో ఎదగాలని ఇంగ్లిష్ మీడియం అమలు చేశారని తెలిపారు. సచివాలయాల ఏర్పాటుతో 2.60 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. 

ఎస్.వి. యూనివర్సిటీ వి.సి. మాట్లాడుతూ భారతరత్న అంబేద్కర్ భారత రాజ్యంగ ప్రదాత అని, భారత దేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు. గొప్ప విద్యావేత్త, సంఘ సంస్కర్త, సమానత్వం కోసం పోరాడిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. 

భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి, రెక్టార్ శ్రీకాంత్ రెడ్డి, రిజిస్ట్రార్ చంద్రయ్య, క్రిస్టియన్ సెల్ అద్యక్షులు ప్రవీణ్ , ఎస్.వి.యూ ఇ.సి. మెంబర్లు మధు బాబు, ద్వారకనాథ్ రెడ్డి ప్రసంగించగా, వివిధ సంఘాల నాయకులు, అద్యాపకులు, మేధావులు, స్కౌట్ అండ్ గైడ్స్ , స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 మద్యాహ్నం ఎస్.సి.కమిషన్ కు అందిన వినతుల మేరకు సంబంధిత అధికారులకు గౌ.కమిషన్ సభ్యులు  పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు.