స్థానిక సంస్థలంటే గౌరవం" - కాకాణి

 *"స్థానిక సంస్థలంటే గౌరవం" - కాకాణి


*


 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), తోటపల్లిగూడూరు మండలంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


తోటపల్లి గూడూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా శ్రీమతి ఉప్పల స్వర్ణలత గారి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాణి.
 మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన ఉప్పల స్వర్ణలత గారికి హృదయపూర్వక అభినందనలు.


 గ్రామ పంచాయితీ సర్పంచులుగా, ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికై, తొలి మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వారందరికీ నా శుభాకాంక్షలు.


 శాసనసభ్యునిగా ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా క్రమంతప్పకుండా నియోజకవర్గంలోని మండల పరిషత్తుల్లో జరిగే సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం నాకు ఆనవాయితీ.


 స్థానిక సంస్థలలో కీలకమైన జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేసినందున స్థానిక సంస్థల పట్ల అవినాభావ సంబంధాలు ఏర్పడ్డాయి.


 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అర్హులందరికీ అందించాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయిలో పనిచేసే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులదే.


 అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గౌరవించి, వారు తీసుకొని వచ్చే సమస్యలను సావధానంగా విని, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి.


 అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు అందరూ కలిసి సమన్వయంతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేద్దాం.