ఆత్మీయుడు ని కోల్పోయాను... శ్రీరంగనాథరాజు

 


పోడూరు (తూర్పు పాలెం) (ప్రజా అమరావతి);ఆత్మీయుడు ని కోల్పోయాను... శ్రీరంగనాథరాజుతూర్పుపాలెం మంత్రి వర్యులు క్యాంపు కార్యాలయంలో శ్రీ కొణిజేటి రోశయ్య వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా  నివాళులర్పించారు


మాజీ ముఖ్యమంత్రి  మాజీ గవర్నర్, రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన కొణిజేటి రోశయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని, ఆత్మీయుడిని కోల్పోయానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తూర్పు పాలెం లోని మంత్రి కార్యాలయంలో కొణిజేటి రోశయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రు లుగా చేసిన టంగుటూరి అంజయ్య ,కోట్ల విజయ భాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి , కోట్ల విజయభాస్కర రెడ్డి , 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ను ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మంత్రి పదవికి వన్నె తెచ్చారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశ పెట్టిన ఘనత రోశయ్య కే దక్కుతుందన్నారు.

బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుగాంచారు అని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ముందుకు తీసుకెళ్లారన్నారు. 2004లో తాను అత్తిలి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు అత్తిలి అభివృద్ధికి ఎంతో సహకరించారని తెలిపారు. రోశయ్య మృతి తీరని లోటని అన్నారు.


 ఈ సంతాప కార్యక్రమంలో 

పెనుగొండ జడ్పిటిసి శ్రీమతి పోడూరు గోవర్ధన , పోడూరు వైస్ ఎంపీపీ ఇందుకూరి సీతారామరాజు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్  శ్రీమతి మామిడిశెట్టి కృష్ణవేణి , స్థానిక నాయకులు కర్రీ వేణుబాబు , గుబ్బల బ్రహ్మం,ఆకి చంటి,  చిన్న,  బొక్క దాసు,  వేదాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments