సూళ్లూరుపేట మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గోపీనాయక్ సస్పెన్షన్

 

సూళ్లూరుపేట మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గోపీనాయక్ సస్పెన్షన్

అమరావతి,డిశంబరు 21 (ప్రజా అమరావతి): ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ట్యాంకర్లను నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేయడం పై  పలు మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలను  రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య  (నాని) తీవ్రంగా పరిగణించారు. ఈ ఆరోపణలకు ప్రధాన బాధ్యునిగా ప్రాథమిక విచారణలో గుర్తించిన సూళ్లూరుపేట మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గోపినాయక్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. గూడూరు ఆర్.టి.ఓ. మల్లికార్జున రెడ్డిని తక్షణమే హెడ్ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తుచేసేందుకు పశ్చిమగోదావరి జిల్లా డిప్యుటీ ట్రాన్సుపోర్టు కమిషనర్ సిరి ఆనంద్ ను  దర్యాపు అధికారిగా నియమించారు. 


Comments