కరోనా సెకండ్‌ వేవ్‌ తరుణంలో బాధితులకు ఈ కుయ్‌..కుయ్‌ శబ్దం కొండంత భరోసా కల్పించిందని

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు.(ప్రజా అమరావతి);



.



, కరోనా సెకండ్‌ వేవ్‌ తరుణంలో బాధితులకు ఈ కుయ్‌..కుయ్‌ శబ్దం కొండంత భరోసా కల్పించిందని


రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు..




 సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు గతేడాది ఒకేసారి 1,088 కొత్త అంబులెన్సులు కొనుగోలు చేయడం యావద్దేశం దృష్టినీ ఆకర్షించారని, ప్రతిమండలంలోనూ 108 అంబులెన్సులు, 104 వాహనాలు అందుబాటులో ఉండడంతో మండలంలోని ఊళ్లన్నిటికీ ఉపయోగంగా ఉందని దీని ద్వారా ఉచితంగా లభిస్తున్న ఈ  104, 108 అంబులెన్సు సర్వీసు కోవిడ్‌ రోగులకు పెద్ద ఊరట కలిగిందని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు..




➡️రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని,ఖర్చుకు వెనుకాడకుండా పేదల ప్రాణాలు కాపాడడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని గత ప్రభుత్వానికి భిన్నంగా రాష్ట్రంలో అంబులెన్స్ రూపురేఖలు మార్చేసిందని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..




 రోగి ఏ స్థాయిలో ఉన్నా ప్రాణాలతో ఆస్పత్రికి తరలించే విధంగా ఆంబులెన్స్ లో వసతులు సమకూర్చిందని బాధితులు ఫోన్‌ చేసిన వెంటనే స్పందించేలా పేదలకు 108 అపరసంజీవినిగా కనిపిస్తోందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు..




దేశంలోనే అంబులెన్సుల నిర్వహణలో మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని.. 




 ఒక్కో అంబులెన్స్‌లో ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌), పైలెట్‌(డ్రైవర్‌) ఉంటున్నారు. వీరు రోజుకు 12 గంటల చొప్పున షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారని మంత్రి ఆళ్ల నాని పేర్కోన్నారు..



ఏలూరు ఉపముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మహేంద్ర & మహేంద్ర కంపెనీ జహీరాబాద్,మహేంద్ర ఆటో గ్రూప్ యాజమాన్యం సహకారంతో కోవిడ్ వ్యాధిని అరికట్టేందుకు రోగుల సదుపాయం కోసం తూర్పుగోదావరి జిల్లాకు ఒక అంబులెన్స్ అదే విధంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి 10 ఆక్సిజన్ కాంసెంట్రేటర్స్ ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని జెండా ఊపి ప్రారంభించారు..




 అనంతరం అంబులెన్స్ లో ఉన్న సదుపాయాలు ను పరిశీలించి మహేంద్ర గ్రూప్ వారిని ప్రత్యేకంగా అభినందించారు.. 




 వసతులు లేని హోం ఐసోలేషన్‌ రోగులను సమీపంలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు, శ్వాస సంబంధిత ఇబ్బందులున్న వారిని ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ సదుపాయంతో కోవిడ్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..



 కోవిడ్‌ బాధితులను ఇంటి నుంచి ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం బయట ప్రాంతాతాలకు తీసుకెళ్లడంలో అంబులెన్స్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు..



 రోగిని సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా ఆంబులెన్స్ కృషి మరువలేనిదని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.. 



  అత్యవసర సమయంలో బాధితులకు శ్వాస సమస్య ఏర్పడితే ఈఆర్‌సీపీ (ఎమర్జెన్సీ రెస్పాన్డ్‌ సెంటర్‌ ఫిజీషియన్‌) సలహాలతో ఆక్సిజన్‌ అంబులెన్స్లో పెడుతున్నారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు..




కోవిడ్, నాన్‌ కోవిడ్‌ సేవలకు అంతరాయం లేకుండా వేర్వేరు వాహనాలను ఏర్పాటు చేసుకుని అంబులెన్స్ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..



 కరోనా రోగులను వేగంగా తరలిస్తూ సకాలంలో వైద్యం అందడానికి ఉపయోగపడుతున్నాయని మంత్రి ఆళ్ల నాని తెలిపారు..






ఈ కార్యక్రమంలో మహేంద్ర గ్రూప్ ఉద్యోగులు సతీష్,, సుధాకర్ అజిత్ , డిప్యూటీ మేయర్ లు నూకపెయ్యి సుధీర్ బాబు, గుడిదేశీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీ మంచేం మై బాబు, సాహిత్య అకాడమీ చైర్మన్ పీల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్నెంట్ ఏ వి ఆర్ మోహన్, ఏలూరు కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, మున్నుల జాను గురునాథ్,ఏపీన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ ఎస్ హరనాధ్, ఎన్జీవో అసోసియేషన్ కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్, వైయస్సార్ సిపి నాయకులు బొద్దని శ్రీనివాస్, నెరుసూ చిరంజీవి, కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు..





*

Comments